రామన్నపేట జర్నలిస్టు సంక్షేమ సంఘం నూతన కమిటీని సీనియర్ జర్నలిస్టు ఎండి ఇబ్రహీం అధ్యక్షతన సోమవారం ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. అధ్యక్షునిగా అప్పం చెన్నకేశ్వర్, ఉపాధ్యక్షునిగా శివరాత్రి రమేశ్, ప్రధాన కార్యదర్శిగా ఎటెల్లి శ్రీనివాస్, కోశాధికారిగా బూరుగు వెంకటేశం, సహాయ కార్యదర్శిగా బోయపల్లి యాదయ్య, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కమిటీ సభ్యులు బి.రమేష్, ఎండి ఇబ్రహీం, కనతాల శశిధర్ రెడ్డి, మీర్జా ఆర్షత్ బేగ్, ఎండి తాఖియోద్దీన్, గంగుల నరేందర్ రెడ్డి, కట్ట నరేందర్, ఎండి గౌస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికన అధ్యక్షుడు అప్పం చెన్నకేశ్వర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం శాయశక్తుల కృషిచేస్తానని అన్నారు. అనంతరం ఆయనను పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు.