- తొలుత వోటు వేసిన బిజెపి ఎంపీ నాక్షి లేఖి
- మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్ ఎంపిక
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 22 : ఎట్టకేలకు దిల్లీ మేయర్ ఎన్నికకు బుధవారం వోటింగ్ పూర్తయింది. మేయర్ ఎన్నిక ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు సుప్రీమ్ కోర్టు ఆదేశాలతో ఎన్నికను నిర్వహించారు. బీజేపీ ఎంపీ నాక్షి లేఖి, హన్సరాజ్‌లు తొలుత వోటేశారు. బుధవారం ఉదయం 11.30 నిమిషాలకు మున్సిపల్ హౌజ్‌లో ప్రారంభించారు. మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీలోని ఆరుగురు సభ్యుల ఎన్నిక కోసం వోటింగ్ జరిగింది. ఎంపీల తర్వాత కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు వోటు వేసారు. ముందుగా లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు వోటేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఇద్దర్ని మేయర్ అభ్యర్థులుగా ప్రకటించింది. షెల్లీ ఒబ్రాయ్, ఆశూ థాకూర్‌లు ఆప్ తరపున పోటీపడుతున్నారు. ఇక బీజేపీ తరపున షాలీమార్ భాగ్ పోటీలో ఉన్నారు. నామినేటెడ్ సభ్యులు వోటు వేయరాదని షెల్లీ ఒబ్రాయ్ సుప్రీమ్ కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. దీంతోనామినేటెడ్ సభ్యులు వోటు వేయరాదని సీజేఐ డీవై చంద్రచూడ్ తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. రాజ్యాంగంలోనూ ఇదే ఉందన్నారు. 250 వార్డులు ఉన్న దిల్లీ మున్సిపాల్టీలో…ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లు గెలిచింది. బీజేపీ 113 సీట్లు కైవసం చేసుకున్నది. దాదాపు 15 ఏళ్ల తర్వాత దిల్లీ మున్సిపాల్టీలో బీజేపీ పట్టుకోల్పోయింది.
మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్ ఎంపిక
దిల్లీ మేయర్ పీఠం ఆప్‌కే దక్కింది. బీజేపీపై చేపట్టిన ఆమ్ ఆద్మీ పోరాటం ఫలించింది. బుధవారం జరిగిన పోలింగ్‌లో దిల్లీ మేయర్‌గా ఆప్ అభ్యర్ధి షెల్లీ ఒబెరాయ్ గెలుపొందారు. దిల్లీ మున్సిపల్ హౌజ్‌లో జరిగిన సమావేశంలో.. బీజేపీకి 116 వోట్లు పోలవ్వగా..ఆప్‌కు 150 వోట్లు పడ్డాయి. మేయర్‌గా ఎన్నికైన షెల్లీ ఒబెరాయ్‌కు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కంగ్రాట్స్ తెలిపారు. ట్విట్టర్‌లో ఆయన విషెస్ పోస్టు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున షెల్లీ ఒబ్రాయ్, ఆశూ థాకూర్‌లు ఆప్ మేయర్ అభ్యర్ధులుగా పోటీపడ్డారు. ఇక బీజేపీ తరపున రేఖా గుప్తా పోటీలో నిలిచారు.