Take a fresh look at your lifestyle.

ఐదు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం..!

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ: బెంగాల్‌లో మూడో విడ‌త పోలింగ్..ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారం ఆదివారంతో ముగిసింది. ఏప్రిల్ 6న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ప‌శ్చిమ‌ బెంగాల్ మూడో విడ‌త ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఓటింగ్ నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మేర‌కు ఈసీ అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. ప‌శ్చిమ బెంగాల్‌తో పాటు, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోంలో శాసనసభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈ ద‌ఫాలో మొత్తం 824 సీట్లకు ఈసారి ఎన్నికలు జరుగుతుండగా… 2.7లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల కమిషన్ స్ప‌ష్టం చేసింది. 18.68 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నట్టు వెల్ల‌డించింది. ప‌శ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 సీట్లు గల రాష్ట్రంలో ఇప్పటివరకు 60 సీట్లకు రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి.

తాజాగా మూడో దశలో భాగంగా మరో 30 సీట్లకు పోలింగ్ జరగనుంది. బెంగాల్లో మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరిగే విషయం విదిత‌మే. అసోం ఎన్నికల్లో ఇప్పటివరకు రెండు విడతలు పూర్తి కాగా మూడో విడత ఈనెల 6న జరగనుంది. తొలి రెండు విడతల్లో 86 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం మిగిలిన 40 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 2న జరగనుంది. త‌మిళ‌నాడులో మొత్తం 234 స్థానాలకు ఎన్నికల కమిషన్ ఒకే దశలో పోలింగ్ నిర్వహించనుంది. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. పుదుచ్చేరి ఏప్రిల్ 6న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. ఇక్కడ 30 అసెంబ్లీ స్థానాలు ఉన్న విష‌యం తెలిసిందే.

Leave a Reply