Take a fresh look at your lifestyle.

సి ఎం రిలీఫ్‌ ‌ఫండ్‌కు రూ.37,78,871ల విరాళం

  • వరంగల్‌ ఏకశిలా ఎడ్యుకేషన్‌ ‌సొసైటీ తరపున రూ. 25 లక్షలు,
  • మనోహర ఎడ్యుకేషన్‌ ‌సొసైటీ, విఎంఆర్‌ ‌పాలిటెక్నిక్‌ ‌రూ. 5 లక్షలు,
  • కిట్స్ ‌వరంగల్‌ ఉద్యోగుల విరాళం రూ. 7లక్షల 78 వేల విరాళం ప్రకటించిన రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ ‌వి.లక్ష్మీకాంత రావు

వరంగల్‌ ఏకశిలా ఎడ్యుకేషన్‌ ‌సొసైటీ తరపున రూ. 25 లక్షల విరాళం ప్రకటించిన రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ ‌వి.లక్ష్మీకాంత రావు   మనోహర ఎడ్యుకేషన్‌ ‌సొసైటీ, వి ఎం ఆర్‌ ‌పాలిటెక్నిక్‌ ‌విరాళం రూ. 5 లక్షలు, కిట్స్ ‌వరంగల్‌ ఉద్యోగుల విరాళం రూ. 7,78,871/- మొత్తం రూ. 37,78,871/- విలువైన మూడు చెక్కులు ఐటీ మంత్రి కె టి ఆర్‌ ‌కు  హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీష్‌ ‌కుమార్‌   అందజేసారు .

 

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కరోనా వైరస్‌ ‌మహమ్మారి నివారణ చర్యలకు, కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు తమ వంతు బాధ్యతగా వరంగల్‌  ‌కిట్స్ (‌కాకతీయ ఇన్స్టిట్యూట్‌ అఫ్‌ ‌టెక్నాలజీ అండ్‌ ‌సైన్స్) ‌యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది, వి ఎం ఆర్‌ ‌పాలిటెక్నిక్‌ ‌కళాశాల యాజమాన్యం  ముందుకు వచ్చారు. వరంగల్‌ ‌లోని ఏకశిలా ఎడ్యుకేషన్‌ ‌సొసైటీ (వరంగల్‌ ‌కిట్స్) ‌తరపున రూ. 25 లక్షల విరాళాన్ని సొసైటీ చైర్మన్‌, ‌రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ ‌వి. లక్ష్మీకాంత రావు ప్రకటించారు. అలాగే కిట్స్ ‌ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, సిబ్బంది తమ ఒక రోజు వేతనం రూ. 7,78,871/- విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించాలని నిర్ణయించారు. వరంగల్‌ ‌రాంపూర్‌ ‌లోని వి ఎం ఆర్‌ ‌పాలి టెక్నిక్‌ ‌కళాశాల యాజమాన్యం, మనోహర ఎడ్యుకేషన్‌ ‌సొసైటీ తరపున రూ. 5 లక్షల విరాళాన్ని ఆ సంస్థ నిర్వాహకులు వేముగంటి ప్రదీప్‌ ‌కుమార్‌ ‌ప్రకటించారు. సి ఎం రిలీఫ్‌ ‌ఫండ్‌ ‌కు విరాళంగా ఇచ్చిన ఈ మూడు రూ. 37,78,871/- విలువైన చెక్కులను సోమవారం హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీష్‌ ‌కుమార్‌ ‌హైదరాబాద్‌ ‌లో ఐటీ, మున్సిపల్‌, ‌పరిశ్రమల మంత్రి కె. టి. రామారావు  ను స్వయంగా కలిసి అందజేశారు. ఈ సందర్బంగా సి ఎం రిలీఫ్‌ ‌ఫండ్‌ ‌కు విరాళాలను అందజేసిన ఏకశిలా ఎడ్యుకేషన్‌ ‌సొసైటీ, వరంగల్‌ ‌కిట్స్, ‌వి ఎం ఆర్‌ ‌పాలిటెక్నిక్‌, ‌మనోహర ఎడ్యుకేషన్‌ ‌సొసైటీ యాజమాన్యాలతో పాటు వరంగల్‌ ‌కిట్స్, అధ్యాపకులు సిబ్బందిని మంత్రి కెటీఆర్‌ అభినందించారు.  కరోనా పై పోరులో భాగస్వాములు కావడం అభినందనీయమని అన్నారు. కరోనా నివారణకు రాష్త్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ కె సి ఆర్‌  ‌తీసుకుంటున్న చర్యలను రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ ‌వి.లక్ష్మి కాంత రావు, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీష్‌ ‌కుమార్‌ ‌ప్రశంసించారు. కరోనా నివారణ, సహాయక చర్యల్లో భాగస్వాములవుతున్న అందరిని అభినందించారు.

Leave a Reply