Take a fresh look at your lifestyle.

నేడు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌శనివారం తన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయనున్నారు. ఉదయం గన్‌పార్క్ ‌వద్ద అమరులకు నివాళి అర్పించి 11 గంటలకు ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. ఈ నెల 14న ఈటల బీజేపీలో చేరతారని ఇప్పటికే ఆ పార్టీ ముఖ్యనేతలు వెల్లడించిన సంగతి తెలిసిందే. శనివారం నాడు మొదట..నగరంలోని గన్‌పార్క్ ‌దగ్గర అమరవీరుల స్థూపానికి ఈటల నివాళులు అర్పించనున్నారు. అనంతరం అసెంబ్లీలోని స్పీకర్‌ ‌కార్యాలయానికి వెళ్లి రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు.

స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ ‌కోరినా సమాధానం లేకపోవడంతో కార్యాలయంలో రాజీనామా లేఖను అందచేస్తారు. ఈ నెల 14న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈటలతో పాటు ముఖ్యనేతలు ఏనుగు రవీందర్‌ ‌రెడ్డి, తుల ఉమతో పాటు మరికొంతమంది నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకొనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తున్నది.

Leave a Reply