Take a fresh look at your lifestyle.

బిజెపిలో చేరిన ఈటల తదితరులు

  • ఆయనతో పాటు ఏనుగు రవీందర్‌ ‌రెడ్డి తుల ఉమ, రమేశ్‌ ‌రాథోడ్‌ ‌తదితరులు చేరిక
  • ధర్మేంద్ర ప్రధాన్‌, ‌తరుణ్‌చుగ్‌ ‌సమక్షంలో కాషాయ కండువా
  • రాష్ట్రంలో బిజెపి బలోపేతానికి పాటుపడతానన్న ఈటల
  • గడీల పాలనకు గండి కొడతామన్న బండి సంజయ్‌

మాజీమంత్రి ఈటల రాజేందర్‌ ‌బీజేపీ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ‌తరుణ్‌ ‌చుగ్‌ల సమక్షంలో ఈటల కాషాయ కండువా కప్పుకున్నారు. తన మద్దతుదారులతో ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన ఆయన…బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం ఆయన బీజేపీలో చేరిపోయారు. ఇటీవల టీఆర్‌ఎస్‌కి గుడ్‌ ‌బై చెప్పిన ఈటలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ‌పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌ ‌చుగ్‌ ‌బీజేపీ సభ్యత్వం ఇచ్చారు. ఈటలతో పాటు ఆదిలాబాద్‌ ‌మాజీ ఎంపీ రమేష్‌ ‌రాథోడ్‌, ‌మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ ‌రెడ్డి , కరీంనగర్‌ ‌మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ ‌తుల ఉమ, గండ్ర నళిని, అందె బాబయ్య, తెలంగాణ ఆర్టీసీ నేత అశ్వత్థామ రెడ్డి సహా అనేకమంది ఉస్మానియా జెఎసి నేతలు కూడా బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ‌పార్టీ ఎంపీలు ధర్మపురి అరవింద్‌, ‌సోయం బాపురావు, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యే రఘునందన్‌ ‌రావు, మురళీధర్‌ ‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కెసిఆర్‌ ‌నిరంకుశ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు.

ఈటల రాజేంద్రర్‌ ‌మాట్లాడుతూ..రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని ఈటల వెల్లడించారు. తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర ప్రజల కోసం పని చేస్తానన్న ఆయన…తెలంగాణలో బీజేపీని అన్ని గ్రామాలకూ తీసుకొని వెళ్ళడానికి శ్రమిస్తానని చెప్పారు. దక్షిణ భారత దేశంలో, తెలంగాణలో బీజేపీని విస్తరించేందుకు బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నానికి తన పూర్తి సహకారం అందిస్తానన్నారు. కమలం గూటికి చేరిన తనకు స్వాగతం పలికి పార్టీలో చేర్చుకున్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌ అధిష్ఠానంపై రమేష్‌ ‌రాథోడ్‌ అసంతృప్తితో ఉన్నారు. తనకు పార్టీలో సముచిత స్థానం లభించడం లేదని తన అనుచరులు, అభిమానులతో మాట్లాడిన తర్వాతనే రమేష్‌ ‌రాథోడ్‌ ‌బీజేపీలో చేరినట్లు సమాచారం. రమేష్‌ ‌రాథోడ్‌ ‌చేరికతో ఆదిలాబాద్‌లో కాషాయం బలపడనుంది. గతంలో రమేష్‌ ‌రాథోడ్‌ ‌ఖానాపూర్‌ ‌నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీజేపీలో చేరడంతో ఖానాపూర్‌లో రాజకీయ సవి•కరణాలు మారనున్నాయి. ఈ సందర్భంగా బండి సంజయ్‌ ‌మాట్లాడుతూ తెలంగాణలో గడీల పాలనకు చరమగీతం పాడుతామన్నారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేలా బిజెపి పనిచేస్తుందన్నారు.

Leave a Reply