- నేడు హైదరాబాద్‌కు భౌతిక కాయం
- సంతాపం వ్యక్తం చేసిన సిఎం కెసిఆర్
- అధికార లాంఛనాలతో
- అంత్యక్రియలకు ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 16 : ఎనిమిదో నిజాం నవాబ్ భర్కత్ అలీఖాన్ వల్షన్ ముకరం ఝా బహదూర్ మృతి చెందారు. శనివారం రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఆయన కన్నుమూశారు. హైదరాబాద్‌లో అంత్యక్రియలు చేయాలని బహదూర్ చివరి కోరిక కావడంతో ఆయన భౌతికకాయాన్ని టర్కీ నుంచి హైదరాబాద్‌కు తీసుకువస్తు న్నారు. నేడు హైదరాబాద్‌కు ఆయన భౌతికదేహం రానుంది. హైదరాబాద్‌కు తీసుకువచ్చిన తర్వాత ప్రజల సందర్శననార్ధం చౌమల్లా ప్యాలెస్‌లో భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం అసఫ్ జాహీ కుటుంబసభ్యుల సమాధుల మధ్య ముఖరం జాను ఖననం చేస్తారు. హైదరా బాద్ 8వ నిజాం నవాబు ముఖరం ఝా బహదూర్ మణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ముఖరంజా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలి పారు. ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వ హించాలని సీఎస్‌ను ఆదేశించారు.
ఆయన చివరి కోరిక మేరకు హైదరాబాద్‌లో అసఫ్ జాహీ టూంబ్స్‌లో అంత్యక్రి యలు నిర్వహించనున్నారు. భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చౌమహల్లా ప్యాలెస్‌లో ఉంచనున్నారు.ఈ కారణంగా చౌమహల్లా ప్యాలెస్‌ను 5 రోజులపాటు మూసివేయనున్నారు. అంత్యక్రియలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి మక్కా మసీదు ఆవరణలో సన్నాహాలు ప్రారంభమయ్యాయి. చౌమహల్లా ప్యాలెస్‌లో ఐదు రోజుల పాటు నిజాం నవాబుల బంధువులు, స్నేహితుల సందర్శనార్థం పార్థివదేహాన్ని ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో సందర్శకులను అనుమతించబోమని నిర్వాహకులు స్పష్టం చేశారు. చౌమహల్లా ప్యాలెస్ నిజాం నవాబు నివాస భవనం. దీనిని 1750లో నిర్మించారు.