ప్రభుత్వ చర్యల వల్లే కరోనా కట్టడి చేయగలిగాం : మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే కరోనా వైరస్ విజృంభించలేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వల్ల పోలీసులు తీసుకుంటున్న చర్యల వల్ల కూడా కరోనా కట్టడి జరిగిందని మంత్రి పోలీసులను అభినందించారు. అనంతరం మేయర్, చీఫ్ విప్‌లు మాట్లాడుతూ పోలీసులు, వైద్యులు, మున్సిపాల్టీ సిబ్బంది సేవలు వెలకట్టలేనివని అన్నారు.
ఈసందర్భంగా మేయర్ గుండా ప్రకాష్ రావు ఆధ్వర్యంలో ములుగు రోడ్డు లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు,సీపీ విశ్వనాధ్ రవిందర్, మున్సిపాలిటి కమిషనర్ సత్పతి పమేలాలను గులబీ పూలు చల్లుతు సన్మానించారు. ములుగు రోడ్డు వద్ద పోలీసులకు మేయర్ ఆధ్వర్యంలో అందిస్తున్న పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌లు ప్రారంభించారు. ఈకార్యక్రమంలో మేయర్ ప్రకాష్ రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, సీపీ వి.రవీందర్, కమిషనర్ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు.