Take a fresh look at your lifestyle.

రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించేలా కృషి

  • తేజాస్‌ ‌యుద్ధ విమనాల తయారీయే ప్రబల సంకేతం
  • రక్షణరంగంపై జరిగిన వెబినార్‌లో మోడీ ప్రసంగం

‌రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు భారత్‌ ‌విశేషంగా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రక్షణ రంగ పరికరాల దిగుమతులను నియంత్రిస్తూ భారత్‌లోనే తయారీని ముమ్మరం చేస్తే ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి నివారించడంతో పాటు ఉద్యోగాలూ సమకూరుతాయని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రక్షణ రంగ కేటాయింపులు సమర్థ వినియోగం అనే అంశంపై ప్రధాని మోదీ సోమవారం జరిగిన ఓ వెబినార్‌లో ప్రసంగించారు. భారత్‌ ‌ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ రంగ దిగుమతిదారుల్లో ఒకటిగా ఉందని, ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు మనం అహరహం శ్రమిస్తున్నామని చెప్పారు. రక్షణ రంగంలో భారత్‌ ‌స్వయం సమృద్ధికి తేలికపాటి తేజాస్‌ ‌యుద్ధ విమనాలే ప్రబల సంకేతమని స్పష్టం చేశారు.

స్వాతంత్య్రానంతరం భారత్‌ ‌చరిత్రలో తొలిసారిగా రక్షణ రంగంలో ప్రైవేట్‌ ‌రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. దేశ రక్షణ రంగాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు మనకు నిర్ధిష్ట కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళిక అవసరమని పిలుపు ఇచ్చారు. ఆయుధాలు, సైనిక పరికరాల తయారీలో భారత్‌కు దశాబ్దాల అనుభవం ఉందని అన్నారు. తొలి, మలి ప్రపంచ యుద్దాల సందర్భంగా భారత్‌ ఆయుధాలు, సాధనా సంపత్తిని సరఫరాలు చేయగా, స్వాతంత్యాన్రంతరం ఈ సామర్ద్యాన్ని బలోపేతం చేయలేదని అన్నారు.

చిన్నపాటి ఆయుధాల కోసం మన చిన్న దేశాలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. భారత్‌ ‌ప్రస్తుతం ఈ సామర్థ్యాలను వేగవంతంగా పెంచుకునేందుకు కట్టుబడి ఉందని అన్నారు. అసోం రాష్ట్రంలో సోమవారం ప్రధాని మోదీ పర్యటించారు. ధెమాజిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర మౌళికసదుపాయాల్ని అభివృద్ధి పరిచేందుకు స్థానిక ప్రభుత్వంతో కలిసి కేంద్రం పనిచేస్తోందన్నారు.

అస్సాంలో అనేక వనరులు ఉన్నాయని, కానీ గత ప్రభుత్వాలు సవతిలా చూశాయని, దాంతో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ధెమాజిలోని సిలాపత్తర్‌లో ప్రధాని మోదీ పలు ప్రాజెక్టులను ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఉన్న టీ, టూరిజం, చేనత, హ్యాండీక్రాప్ట్ ‌రంగాలు ఈ రాష్ట్రాన్ని  స్వయం సమృద్ధిగా మారుస్తున్నాయన్నారు. సబ్‌కా సాత్‌, ‌సబ్‌కా వికాశ్‌ ‌నినాదంతో సీఎం శరబానంద సోనావాల్‌ ‌పనిచేశారని కితాబిచ్చారు. బోగీబీల్‌ ‌బ్రిడ్జ్‌ను పూర్తి చేశామని, బ్రహ్మపుత్రపై నిర్మించిన కలియబొమెర బ్రిడ్జ్ ‌నిర్మాణంతో అస్సాంలో కనెక్టివిటీ పెరిగిందని ప్రధాని అన్నారు. రాష్ట్రంలో ఫోర్‌లేన్‌ ‌రహదారి పనులు కూడా పురోగతిలో ఉన్నట్లు వెల్లడించారు. అస్సావి• ప్రజలకు కావాల్సినవన్నీ అస్సాంలో ఉన్నాయని, కేవలం డబుల్‌ ఇం‌జిన్‌ ‌ప్రగతి కావాలన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని రెట్టింపు చేస్తానని హావి• ఇస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.

Leave a Reply