అభివృద్ధిలో సదాశివపేటను నెంబర్ వన్ స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలి

అభివృద్ధిలో సదాశివపేటను నెంబర్ వన్ స్థానంలో ఉంచేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం నాడు సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణాo లో పట్ణణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు. వంగిన స్తంభాలు, తుప్పు పట్టిన స్తంభాలు, రోడ్డు మధ్యలో స్తంభాలు, ఫుట్ పాత్ లపై ట్రాన్స్ఫార్మర్లు లేకుండా చూడాలని, మొత్తంగా ప్రమాద రహితమైన విద్యుత్ వ్యవస్థ లేకుండా చూడాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విద్యుత్ అదికారులకు సూచించారు. పట్టణ ప్రగతి కార్యాక్రమంలో భాగంగా 10 రోజుల పాటు చేపట్టిన ఏ కార్యక్రమంలో మంత్రి సదాశివపేట పట్టణంలోని గోల్లకెరీ కాలనీ లో పలు ప్రాంతాల ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు .విద్యుత్తు అధికారులకు పలు సూచనలు చేసినారు.