Take a fresh look at your lifestyle.

అం‌దరికీ టీకా అందించేలా కృషి చేయాలి

  • దిశ కమిటీ సమావేశంలో కిషన్‌ ‌రెడ్డి సూచన
  • అధికారుల గైర్హాజరుపై ఆగ్రహం

అం‌దరికీ కొరోనా టీకా అందించేందుకు అధికారులు కృషి చేయాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. గురువారం దిశ కమిటీ సమావేశంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాల వద్ద 20 కోట్ల డోసుల టీకా అందుబాటులో ఉందని తెలిపారు. రాజకీయ పార్టీలు, మహిళా సంఘాల సహకారంతో బస్తీల్లో వ్యాక్సినేషన్‌ ‌పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌ ‌బేగంపేట్‌ ‌టూరిజం ప్లాజాలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన దిశ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ ప్రారంభ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై చర్చ చేపట్టారు. సమావేశానికి జిల్లా కలెక్టర్‌, ‌జీహెచ్‌ఎం‌సీ కమిషనర్‌ ‌గైర్హాజరవడంపై కిషన్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌, ‌కమిషనర్‌ ‌లేకుండా సమావేశం ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.

కేంద్రమంత్రి ఆగ్రహంతో జిల్లా కలెక్టర్‌, ‌జీహెచ్‌ఎం‌సీ కమిషనర్‌ ‌సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా టీకా పక్రియలో భారత్‌ ‌కృషి అమోఘమని అన్నారు. ఇతర దేశాలు భారత్‌ ‌టీకా కోసం ఎదురు చూస్తున్నాయన్నారు. బస్తీ దావాఖానాలను సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. పథకాలు అమలు చేస్తున్నప్పుడు తలెత్తే సమస్యలను అధికారులు గుర్తించాలన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైతే పథకాల్లో మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందని చెప్పారు. స్వనిది యోజన పథకం హైదరాబాద్‌లో అధికారులు బాగా అమలు చేశారని అభినందించారు. వీధి వ్యాపారులుగా గుర్తింపు కార్డు ఇవ్వడంలో ఆలస్యమవుతుందని, దానిని అధిగమించాలని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి సూచించారు.

Leave a Reply