Take a fresh look at your lifestyle.

నేరాల అదపునకు పోలీస్‌ ‌శాఖ కృషి: ఎస్పి

మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు

సూర్యాపేట, జులై23, ప్రజాతంత్ర ప్రతినిధి): నేరాల అదుపునకు పోలీస్‌ ‌సిబ్బంది ఎల్లప్పుడు కృషి చేయాలని జిల్లా ఎస్పి ఆర్‌.‌భాస్కరన్‌ అన్నారు. గురువారం జిల్లా పోలీస్‌ ‌కార్యాలయంలో జిల్లా పోలీస్‌ అధికారులతో ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా పోలీస్‌ ‌సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ మేరకు సమీక్ష నందు కేసు ఫైల్స్ ‌యొక్క స్థితిగతులను, పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు తీవ్రమైన నేరాల దర్యాప్తులో ప్రణాళికలను ఏర్పాటుచేసుకోని అమలు చేయాలని కోరారు.మహిళ సంబంధిత నేరాల విచారన చేసేటప్పుడు మహిళ పోలీస్‌ అధికారి సమక్షంలో విచారన నిర్వహిస్తు, వేగవంతం చేయాలని తెలిపారు. నేరం జరిగిన ప్రాంతాన్ని వీడియో, ఫోటోలు తీసుకోవాలని, మైనర్‌ అత్యాచార కేసుల్లో మహిళ పోలీసు అధికారి సమక్షంలో బాధితులు, వారి కుటుంబ సభ్యుల యొక్క వాంగ్మూలాన్ని వీడియో రూపం రికార్డు చేసి భద్రపర్చుకోవాలని అన్నారు.

పెండింగ్‌లో ఉన్న కేసులను పూర్తిచేయడానికి కృషి చేయాలని తద్వారా నేరస్తుల సంఖ్య తగ్గుతుందని, నాణ్యమైన సేవలు అందించడం ద్వారా పూర్తిస్థాయిలో నేరస్తులకు శిక్షపడుతుందని గుర్తుచేశారు. నేరాల అదుపుకు జిల్లా పోలీస్‌ ‌శాఖ అనుక్షణం పనిచేస్తుందని, జిల్లా వ్యాప్తంగా నిఘా కట్టుదిట్టం చేయడం జరిగిందని, అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రతి రోజు నాలుగు విడతల్లో పెట్రోలింగ్‌ ‌నిర్వహిస్తున్నామని అన్నారు. జాతీయ రహదారిపై మూడు సెక్టార్స్‌లలో మోబైల్‌ ‌పెట్రోలింగ్‌ ‌వాహనాలచే గస్తీ నిర్వహిస్తున్నాని తెలిపారు. సస్పెక్ట్ ‌షీట్స్, ‌రౌడీ షీట్స్ ‌నమోదు చేస్తున్నామని తెలిపారు. మహిళలపై దాడులకు పాల్పడ్డ, వేధింపులకు గురిచేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళల రక్షణ పట్ల షీటీమ్స్, ‌భరోసా సెంటర్‌, ‌సఖి సెంటర్‌, ‌ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ ‌సెంటర్స్ ‌నందు సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. ఇట్టి వీడియో కాన్ఫరెన్స్‌లో వారి వారి కార్యాలయాల నుండి డిఎస్పి మోహన్‌కుమార్‌, ‌రఘు, సిఐలు ఆంజనేయులు, విఠల్‌రెడ్డి, రవి, శివ శంకర్‌, శ్రీ‌నివాస్‌, ‌రాఘవరావు, శివరాం రెడ్డి, శ్రీనివాస్‌ ‌రెడ్డి, రాజేష్‌, ‌సుధాకర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!