Take a fresh look at your lifestyle.

మోడల్‌ ‌మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దేందుకు కృషి వనపర్తి కలెక్టర్‌ ‌షేక్‌ ‌యాస్మిన్‌ ‌బాష

వనపర్తి,మే,18(ప్రజాతంత్ర విలేకరి) : మున్సిపల్‌ ‌కౌన్సిలర్లు బడ్జెట్‌ ‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్‌ ‌షేక్‌ ‌యాస్మిన్‌ ‌బాష అన్నారు. సోమవారం వనపర్తి మున్సిపల్‌ ‌చైర్మెన్‌ ‌గట్టు యాదవ్‌ అధ్యక్షతన తరుని ఫంక్షన్‌ ‌హాలులో నిర్వహించిన మున్సిపల్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతు బడ్జెట్‌ ‌లోని ప్రతి అంశంపై కౌన్లిర్‌ ‌లకు అవగహాన ఉన్నప్పుడే ఆదాయం, వ్యయం పై పట్టు ఉంటుందని అన్నారు. 2020-21 సంవత్సరానికి సంబంధించి వనపర్తి మున్సిపాలిటికి సుమారు 50.27 కోట్ల రాపాయల వార్షిక ప్రతిపాదన బడ్జెట్‌ను అంచనాలు 50.08 కోట్ల రూపాయల ప్రతిపాదిత వ్యయ అంచనాలను రూపొందించటం జరిగింది. ఇందులో పన్నులు, రెవెన్యూ పన్నెతర రాబడి ద్వారా ఆదాయాన్ని జీత భత్యాలు విద్యుత్‌ ‌బిల్లులు వివిధ కరాల ఖర్చులను చూపించడం జరిగింది. మున్సిపాలిటిలు ఆదాయం పెంచుకునే అంశాలపై పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకోవాలని ముఖ్యంగా ఇంటి పన్నుల వసూలు పై పాత పద్దతులను అనుసరించకుండా కొత్త పద్దతి ద్వారా వసూలు చేయాలని కలెక్టర్‌ ‌సూచించారు. అంతేకాక మార్కెట్‌ల ద్వారా ఆదాయం స్తుందని, తై బజార్‌ ‌ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జూన్‌ ‌లో ప్రభుత్వం టిఎస్‌బిపాస్‌ ‌ను ప్రారంభించనుందని దీనిపై విస్త•త ప్రచారం కల్పించాలని ఆమె తెలిపారు.ఈ చట్ట ప్రకారం ఎవరైనా భవన నిర్మాణంలో తప్పుడు సమాచారం ఇస్తే భవనాన్ని కూల్చి వేసేందుకు కూడా అవకాశం ఉందని కలెక్టర్‌ ‌వెల్లడించారు. మున్సిపాలిటీలను మోడల్‌ ‌మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దేందుకు శానిటేషన్‌ ‌పై దృష్టి కేంద్రీకరించాలని సిబ్బంది తదితర అంశాలపై దృష్టి సారించాలని చెప్పారు. ముఖ్యంగా బడ్జెట్‌ ‌కు సంబంధించి వచ్చే ఆదాయం నుండి తప్పనిసరిగా చెల్లించాల్సిన ఖర్చుపై మున్సిపాలిటిలు ముందు దృష్టి సారించాలని అప్పులు, సిబ్బంది జీత భత్యాలు విద్యుత్‌ ‌బిల్లులు పారిశుద్ద్య పై చేసే ఖర్చులు ముందు చెల్లించాలని బడ్జెట్‌ ‌లో 10శాతం హరితహారం కు కేటాయించాలని అన్నారు.

డంపింగ్‌ ‌యార్డు పై కూడా మున్సిపాలిటి దృష్టి పెట్టాలని చెప్పారు. బడ్జెట్లో మూడవ వంతు విలీన గ్రామాలు ఎస్సీ, ఎస్టీ, వెనకబడిన ప్రాంతాలలో ఖర్చు చేయాలని తెలిపారు. సిసి రోడ్లు మురికి కాలువలకు చివరి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. హరితహారంకు సంబంధించిన వార్డులలో 85 శాతం మొక్కలు బ్రతికించే బాధ్యత కౌన్సిలర్ల పై ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు. మున్సిపల్‌ ‌చైర్మెన్‌ ‌గట్టు యాదవ్‌  ‌సమావేశాన్ని ప్రారంభిస్తు బడ్జెట్‌ ‌సమావేశ వివరాలను ప్రాధాన్యతను వివరించారు. వనపర్తి మున్సిపాలిటిని అభివృద్ది పథంలో ముందుకు తీసుకువెళ్లటంలో అందరూ సహకరించాలని కోరారు. మున్సిపల్‌ ‌వైస్‌ ‌చైర్మెన్‌ ‌వాకిటి శ్రీధర్‌ ‌మాట్లాడుతు మున్సిపల్‌ ఆద్యాం పెంచుకునేందుకు ప్రభుత్వ శాఖల ద్వారా రావలసిన ఆస్థిపన్నుల బకాయిలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకేవాలని అదనపు కలెక్టర్‌ ‌డి.వేణుగోపాల్‌ ‌కు విజ్ఞప్తి చేశారు. సమావేశానికి అదనపు కలెక్టర్‌ ‌డి.వేణుగోపాల్‌ ‌మున్సిపల్‌ ‌కమీషనర్‌ ‌మహేశ్వర్‌రెడ్డి, మేనేజర్‌ ‌నరేష్‌, ‌మున్సిపల్‌ ‌కౌన్సిలర్లు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!