Take a fresh look at your lifestyle.

‌ప్రకృతిపై కొరోనా వైరస్‌ ‌లాక్‌డౌన్‌ ‌ప్రభావం

నావల్‌ ‌కొరోనా వైరస్‌ ‌వల్ల కలిగే కోవిడ్‌ -19 ‌వ్యాధి ప్రపంచ మహమ్మారిగా గుర్తించబడింది. ఒకవైపు దాని వ్యాప్తి ప్రజల జీవితానికి మరియు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు అతి పెద్ద ముప్పుగా మారింది. మరోవైపు ఇది పర్యావరణంపై సానుకూల ప్రభావాలను కలిగివుంది. కొరోనా వైరస్‌ ‌లాక్‌డౌన్‌ ‌వల్ల వివిధ మానవ కార్యకలాపాలన్నీ (అత్యవసర సేవలు తప్ప) స్తంభించిపోయాయి. గత కొన్ని సంవత్సరాలుగా కలుషితమవుతున్న గాలి, నీటి నాణ్యత మరియు జీవ వైవిధ్యానికి సంబంధించిన కీలక పర్యావరణ సూచికలు ఒక్కసారిగా మెరుగుపడ్డాయి. ఇది స్వల్ప కాలికంగా పర్యావరణంలో కలిగిన మార్పే అయినప్పటికీ, ఈ కాలం మనకు సామాజిక ప్రవర్తన మరియు బాధ్యతలను గురించి నేర్పింది.

లాక్‌డౌన్‌ ‌యొక్క పర్యావరణ లాభాలను నిలకడగా కొనసాగించడానికి కఠినమైన పర్యావరణ అనుకూల ప్రయత్నాలు అవసరమవుతాయి. అంతేకాకుండా, ప్రకృతిలో మానవాళికోసం జరిగిన అనుకూల మార్పులపై, పర్యావరణ అవగాహనకు సంబంధించిన సమస్యలపై ఎక్కువగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించవలసిన అవసరం వుంది. పర్యావ రణంపై మానవ కార్యకలాపాల ప్రభావం గణనీ యంగా ఉందని మరియు భవిష్యత్తు తరాలు తీవ్రమైన పరిణామాలకు గురి కావలసి వస్తుందని ఇపుడు అంగీకరించబడినది.

వైవిధ్య భరితమైన జీవ భౌతిక వాతావరణం కారణంగా భారత దేశం విస్తృతమైన జీవావరణ వ్యవస్థలకు మరియు అనేక జీవ వైవిధ్యాలకు ప్రసిద్దికి చెందింది. అంతేకాకు ండా వివిధ జీవ భౌగోళిక ప్రాంతాలు ఉన్నందున దేశం విభిన్న రకాల జీవ వనరులను కలిగి వుంది. ఒకవైపు హిమాలయా ప్రాంతం 5 లక్షల కిలోమీటర్లు 2 విస్తీర్ణంలో, మరోవైపు విస్తారమైన తీరా ప్రాంతం 7517 కి.మీ. విస్తీర్ణంలో వుంది. ఏదేమైనా ఆవాసాల విచ్చిన్నం, సుస్థిరత లేని భూ వినియోగ పద్ధతులు, ఆవాసాల నష్టం, వాతావరణ మార్పు, కాలుష్య స్థాయి పెరుగుదల మొదలగునవి కొన్ని సమస్యలు. ఇవన్నీ భారతదేశ, జీవవైవిధ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి.

కొరోనా వైరస్‌ ‌మహమ్మారి వ్యాప్తి దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని సృష్టించింది మరియు సమాజంలో వేగంగా వ్యాప్తి చెందడాన్ని నియంత్రించడానికి సుధీర్ఘమైన లాక్‌డౌన్‌ను ప్రభుత్వం విధించవలసి వచ్చి ంది. పరిశ్రమలు, కంపెనీలు, పాఠశాలలు, కళా శాలలు ప్రతీది దాదాపు మూడు నెలలు మూసి వేయ బడ్డాయి. ఇది అన్ని రకాల రవాణా మార్గాలను నిలిపి వేసింది. ఈ చర్యలన్నీ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఆర్ధిక నష్టాన్ని కలిగించాయి. దురదృష్ట వశాత్తు కొందరు ప్రాణాలను కోల్పోగా మరికొందరు ఉద్యోగాలనుకోల్పోయారు. చాలామంది ప్రజలు ఈ కాలంలో రోజు వారి భోజనం సంపాధించడానికి కూడా చాలా కష్టపడ్డారు. మానవులకు ఈ లాక్‌డౌన్‌ ‌సంక్షోభంగా ఉన్నప్పటికీ ఇది పర్యావ రణానికి మాత్రం అనుకూలమైనదని నిరూపిం చబడింది. పర్యావరణంపై ఈ లాక్‌డౌన్‌ ‌యొక్క అద్భుతమైన ప్రభావం దేశవ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తుంది.

గాలి నాణ్యతలో మెరుగుదల:
కొరోనా వైరస్‌ ‌మహమ్మారి కారణంగా విధించబడిన ఈ లాక్‌డౌన్‌, ‌గత కొన్ని దశాబ్దాలలో మనం ఇంతకు ముందెన్నడూచూడని విధంగా పర్యావరణాన్ని, ప్రకృతిని పునరుద్ధరించింది. కఠినమైన ప్రయాణ ఆంక్షలు, పరిశ్రమలను మూసివేయడం మరియు అన్ని రకాల వాణిజ్య, నిర్మాణ కార్యకలాపాలను నిలిపివేయడం మూల ంగా గాలి నాణ్యతలో మెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. లాక్‌డౌన్‌ ‌సమయంలో కర్బన ఉద్గారాలు బాగా పడిపో యాయి. మరియు సస్పెండెడ్‌ ‌పార్టిక్యూలేట్‌ ‌మేటర్‌ (suspended particulate matter ) PM 10, పీఎం 2.5 , NO2, మరియు SO2 వంటి హానికరమైన వాతావరణ కాలుష్య కారకాల స్థాయిలు కూడా బాగా తగ్గిపోయాయి. దేశంలోని చాలా ప్రాంతాలలో లాక్‌డౌన్‌ ఐన తర్వాతSPM స్థాయిలలో గణనీయమైన తగ్గుదల ఉందని శాటి లైట్‌ ‌నుండి లభించిన సమాచారం కూడా ధ్రువీకరించింది.

సెంటర్‌ ‌ఫర్‌ ఆత్మోస్ఫఈరికి అండ్‌ ఓషియానిక్‌ ‌సైన్స్ ‌మరియు ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ అఫ్‌ ‌సైన్స్ , ‌బెంగుళూరు కూడా శిలాజ ఇంధన దహనం, ఉద్గారాల తగ్గింపు కారణంగానే పర్యావరణంలో కాలుష్య స్థాయిలు గణనీయంగా తగ్గాయని సూచించాయి. మెగా సిటీ ఢిల్లీ యొక్క గాలి నాణ్యతపై, కోవి డ్‌ -19 ‌మహమ్మారి లొక్డౌన్‌ ‌ప్రభావం’ అనే అధ్యయనం ‘ ద సైన్స్ అఫ్‌ ‌ది టోటల్‌ ఎన్విరాన్మెంట్‌’ అనే జర్నల్‌ ‌లో ప్రచురితమైంది. లొక్డౌన్‌ ‌పూర్వ కాలంతో పోలిస్తే M 10 & PM 2. 5 సాంద్రతలు,NO2, COల స్థాయిలు గణనీయంగా పడిపోయాయని, గాలి నాణ్యత మెరుగు పడిందని వెల్లడించింది. యూరోపియన్‌ ‌స్పేస్‌ ఏజెన్సీ యొక్క ఉపగ్రహం నుండి లభించిన సమాచారం కూడా ఈ విషయాన్నే తెలిపింది. ఇది లొక్డౌన్‌ ‌కాలంలో NO2 స్థాయిలో గణనీయమైన తగ్గింపు వున్నదని సూచించింది.

నీటి వనరులలో మెరుగుదల :
లాక్‌డౌన్‌ ‌పూర్వ కాలంతో పోలిస్తే D.O . BOD & COD పరంగా, లాక్‌డౌన్‌ ‌తర్వాత మన నీటి వనరులు నదులు, సముద్రాలలోని నీటి నాణ్యతలో మెరుగుదల వుంది. లాక్‌డౌన్‌ ‌కాలంలో పారిశ్రామిక వ్యర్ధాలను నదులు, సముద్రాలలోకి విడుదల చేయడం ఆగిపోవడం కారణంగానే నీటి నాణ్యతలో మార్పు కనిపించింది. దశాబ్దాల కాలం తర్వాత రిషికేష్‌, ‌హరిద్వార్‌లోని గంగానది నీరు తాగడానికి అనువైనదిగా మారింది. ఘన వ్యర్ధాలను, ప్లాస్టిక్స్ ‌ను నీటి వనరులలో వదలడం వల్ల జలచరాల కు ముప్పు వాటిల్లుతుంది. ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే లాక్‌డౌన్‌ ‌సమయంలో పర్యాటక కార్యకలాపాలను పరిమితం చేయడంవల్ల, నీటి వనరులలో కాలుష్య స్థాయి తగ్గింది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి, ఢిల్లీ జల్‌ ‌బోర్డు చేసిన యమునా నది నీటి విశ్లేషణలో కాలుష్యకాలు తగ్గి, నీటి నాణ్యతలో మెరుగుదల కనిపించిందని సూచించింది. ఇది ప్రధానంగా కాలుష్య కారకాలను నీటిలోకి విడుదలచేయడం తగ్గడం వల్లనే. కొరోనా లాక్‌డౌన్‌ ‌వల్ల నీటి వనరులలో కాలుష్య కారకాలు తగ్గి, నీటి నాణ్యత పెరగడం, జల చారాల జీవనంలో మార్పులు వచ్చాయని చెప్పడం అతిశయోక్తి కాదు.

పశ్చిమ బెంగాల్‌ ‌రాష్ట్రంలో 30 సంవత్సరాల తర్వాత, కాలుష్యకాల వల్ల ప్రమాదంలో పడిన డాల్ఫిన్లు, గంగా నదిలో తిరిగి కనిపించాయి. సముద్ర తీరంలో కూడా అనేక వేల వలస పక్షులు గుమికూడాయి. మొత్తం మీద పర్యావరణంలో, జీవావరణ వ్యవస్థలలో ఆకస్మిక మార్పులు , మొత్తం ప్రపంచానికి నాటకీయంగా మార్పును తెచ్చింది. రక్షిత ప్రాంతాలు మరియు వన్య ప్రాణులపై ప్రభావం లాక్‌డౌన్‌ ‌కచ్చితంగా మన రక్షిత ప్రాంతాలను మరియు వన్య ప్రాణులను ప్రభావితం చేసింది. సాధారణంగా మన దేశంలో ఉద్యాన వనాలు, వన్య ప్రాణుల సంరక్షణా కేంద్రాలు, అభయారణ్యాలు నవంబర్‌ ‌నుండి జూన్‌ ‌నెల వరకు తెరచి ఉంటాయి. ఈ కాలంలో లక్షలాది మంది పర్యాటకులు వాటిని సందర్శి స్తారు. కానీ ఈ సంవత్సరం ఈ రక్షిత ప్రాంతా లలో మానవ కార్య కలాపాలు ఏమి జరుగలేదు. పర్యాటకులను ఎవరిని అనుమతి ంచలేదు.

దీని వల్ల అడవి జంతువుల వాటి వాటి పరిధిలో స్వేచ్ఛగా సంచరించడం జరిగింది. లాక్‌డౌన్‌ ‌సమయంలో కొన్ని అడవి జంతువుల విచ్చలవిడిగా, స్వేచ్ఛగా బహిరంగ ప్రదేశాలలో విహరిస్తున్నట్లు కొన్ని నివేదికలు వచ్చాయి. ఈ కాలంలో అస్సాం లోని గౌహతి నగరంలో విస్టలింగ్‌ ‌డక్‌ ‌కనిపించింది. నగరం నడిబొడ్డున వున్న డిగ్గలిపుఖురి సరస్సు నుండి గుర్తించబడింది. అదేవిధంగా వాయువ్య శివాలిక్‌ ‌ప్రాంతంలో కూడా అరుదయిన వేసవి వలస పక్షి ఐన హూడెడ్‌ ‌పిట్ట , హరిద్వార్‌ ‌నగరానికి సమీపాన కల అడవులలో కనిపించింది.ఆలివ్‌ ‌రిడ్లీ టుర్త్లెస్‌ ‌పగటి పూటే అసాధారణంగా గూడు కట్టుకోవడం ఒడిస్సా లోని ఋషి కుల్య రూకరీ మరియు గహిర్మాత తీరాలలో కనబడిందని నివేదికలు తెలియజేశాయి.

బహుశా బీచ్‌ ‌లలో మానవ కార్యకలాపాలు ఏమి జరగకపోవడమే దీనికి కారణం కావచ్చు.లాక్‌డౌన్‌ ‌వల్ల మనకు కలిగిన ఈ విధమైన లాభాలను కొనసాగిం చడానికి, భవిష్యత్తు వ్యూహాలతో కాలుష్యాన్ని తగ్గించడం, నీటి యాజమాన్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణ, తీరప్రాంతాల పై దృష్టిసారించడం, అటవీ, వన్య ప్రాణుల సంరక్షణల కొరకు ప్రణాళికలను ఏర్పరచుకోవాలి. అంతేకాకుండా ప్రజలకు అవగాహన కలిపించి చైతన్య వంతులుగా చేయాలి. ముఖ్యంగా విద్యార్థులకు పర్యావరణ అంశాలపై శిక్షణనివ్వడం ద్వారా గుణాత్మకమైన మార్పును తీసుకు రాగలం. లాక్‌డౌన్‌, ‌మన జీవితంలో, పూర్వంలో చూడని విధంగా ప్రకృతికి ప్రయోజనం చేకూర్చింది. అంతేకాకుండా,ఇది దశాబ్దాల క్రితం మనం వదిలిపెట్టినఅలవాట్లను తిరిగి మనముం దుంచింది. మహమ్మారి కరోనా వైరస్‌, ‌కోవిద్‌ 19 ‌లొక్డౌన్‌ ఎత్తివేసిన తరువాత మనలో ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాల్సిందే..
– డా. చిందం రవీందర్‌,ఎం.ఎస్సి. ఎం.ఎడ్‌. ‌పి హెచ్‌.‌డి. (పర్యావరణ శాస్త్రం)

Leave a Reply