Take a fresh look at your lifestyle.

ఈ ‘ఏటి’ బ్రతుకులింతేనా..?

“ఏటా కొత్త ఉద్యోగావకాశాలు ఏర్పాడాల్సిన తరుణంలో ఉన్న ఉద్యోగాలకే ఎసరు ఏర్పడింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది సంఖ్యలో ఉద్యోగ, ఉపాధిని కోల్పోవడానికి కారణమైంది. ఉపాధి రంగంలో మెరుగైన ఐటి రంగం మొదలు, వివిధ ప్రైవేటు కంపెనీలు క్రమేణ తమ ఉద్యోగస్తుల్లో కొందరికి ఉద్వాసన చెప్పగా మరి కొందరిని సగం వేతనాలతో పనిచేయించుకుంటున్నాయి. మహమ్మారిని ఎదుర్కునే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రభుత్వోద్యోగులకు సగం వేతనాలనివ్వాల్సి వొచ్చింది. అయితే కోత విధించిన వేతనాలను క్రమేణ ఉద్యోగస్థులకు ప్రతీనెల జమచేస్తున్నప్పటికీ ప్రైవేటు రంగంలో మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది. సగం వేతన కోతలేకాదు, అసలు వేతనాలే అందని పరిస్థితిలో లక్షలాది మంది కొట్టుమిట్టాడుతున్నారు.”

కొరోనా-1 ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థనంతటినీ కుదేలు చేసింది. ఏటా కొత్త ఉద్యోగావకాశాలు ఏర్పాడాల్సిన తరుణంలో ఉన్న ఉద్యోగాలకే ఎసరు ఏర్పడింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది సంఖ్యలో ఉద్యోగ, ఉపాధిని కోల్పోవడానికి కారణమైంది. ఉపాధి రంగంలో మెరుగైన ఐటి రంగం మొదలు, వివిధ ప్రైవేటు కంపెనీలు క్రమేణ తమ ఉద్యోగస్తుల్లో కొందరికి ఉద్వాసన చెప్పగా మరి కొందరిని సగం వేతనాలతో పనిచేయించుకుంటున్నాయి. మహమ్మారిని ఎదుర్కునే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రభుత్వోద్యోగులకు సగం వేతనాలనివ్వాల్సి వొచ్చింది. అయితే కోత విధించిన వేతనాలను క్రమేణ ఉద్యోగస్థులకు ప్రతీనెల జమచేస్తున్నప్పటికీ ప్రైవేటు రంగంలో మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది. సగం వేతన కోతలేకాదు, అసలు వేతనాలే అందని పరిస్థితిలో లక్షలాది మంది కొట్టుమిట్టాడుతున్నారు. ఇందులో సినీరంగ కార్మికులు, ప్రైవేటు టీచర్లు, నాన్‌ ‌టీచింగ్‌ ‌స్థాఫ్‌తోపాటు నాల్గవ తరగతి ప్రైవేటు ఉద్యోగులు లక్షలాది సంఖ్యలో ఆర్థిక భారంతో కొట్టుమిట్టాడుతున్నారు.

కొరోనా తీవ్ర రూపం దాల్చటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చ్ ‌పదహారు నుండి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. వాటితోపాటు సినిమాహాళ్ళు, హోటళ్ళు, రెస్టారెంట్స్, ‌మ్యారేజీ హాల్స్ ఇలా ప్రైవేటు రంగానికి సంబంధించిన అనేక సంస్థలు మూతపడడంతో ఆయారంగాల్లో పనిచేసే వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు సినీ పరిశ్రమ ఇటు సినిమా టాకీసులు మూతపడడంతో ఆ రంగంలో పనిచేసే అనేకమంది కూలి పనులకు వెళ్ళాల్సిన పరిస్థితేర్పడింది. కూలీ పనులు కూడా లభించని పరిస్థితిలో కుటుంబమంతా ఉపవాసాలుండక తప్పని పరిస్థితి. రాష్ట్రంలో మూడు నాలుగు సార్లుగా లాక్‌ ‌డౌన్‌ ‌పొడిగిస్తూ పోవడం, నిన్నటి వరకు సినిమాహాళ్ళు, ఫంక్షన్‌ ‌హాల్స్ ‌తెరుచుకోకపోవడం ఆ రంగంలోని కార్మికులకు శాపంగా మారింది. అలాగే ఒక నెల కాకపోయినా మరో నెలలోనైనా పాఠశాలలు తెరుస్తారని నిన్నటి వరకు ఆశగా ఎదురు చూస్తున్న ఈ రంగంలోని ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ ‌కళాశాల సిబ్బందికి మరోసారి నిరాశనే ఎదురైంది. ఇప్పటికే దాదాపు పది నెలలుగా వేతనాలులేక, కుటుంబ పోషణకోసం అప్పులపాలైన వారికి ఇప్పుడు కొరోనా-2 మరింత భయబ్రాంతులకు గురిచేస్తున్నది.

కొరోనా-1 కన్నా అత్యంత వేగవంతంగా విస్తరించే ఈ వైరస్‌ ‌విషయంలో మరోసారి ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఇంగ్లాండ్‌ ‌నుండి ఇప్పుడు ఇండియాకే కాదు, తెలంగాణకు కూడా ఈ వైరస్‌ ‌చేరడంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత జాగ్రత్తలు తీసుకోకతప్పటం లేదు. ఈ పరిస్థితిలో ఇప్పుడప్పుడే పాఠశాలలు తెరిచే అవకాశాలు కనిపించడంలేదు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధు)కు ఈ వైరస్‌ ‌త్వరగా అంటుకుంటుందంటున్న తరుణంలో చిన్నపిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు ఏమాత్రం ఇష్టపడే పరిస్థితిలేదు. ముందుగా జనవరి మొదటివారం నుండి పాఠశాలలను తెరువాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. కాని, ఇప్పుడు కోవిద్‌-2 ‌శరవేగంగా దూసుకొస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది. ముఖ్యంగా ఒకటి నుండి అయిదవ తరగతి వరకు స్కూళ్ళను అలానే మూసివేసి, వారిని ఈ సంవత్సరం కూడా ప్రమోటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. దీంతో ఈ ఏడాది పాఠశాలలు తెరుచుకోని విద్యా సంవత్సరంగా మిగిలిపోనుంది.

- Advertisement -

చిన్న తరగతుల వరకైతే ఎలాగో సరిపెట్టుకోవచ్చు. కాని ఆరు నుండి పదవ తరగతి విద్యార్దుల సంగతేమిటన్నదే ప్రశ్న. తొమ్మిది నుండి పదవ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు కనీసం మూడు నెలలపాటైనా పాఠశాలలు తెరిచి ఉంచాలన్నది విద్యాశాఖ ఆలోచన. కనీసం వీరితో పాటు జూనియర్‌ ‌కళాశాలలను నూతన సంవత్సరం ప్రారంభంలో జనవరి నాలుగు నుండి తెరిచే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళుతున్నారు. ప్రభుత్వం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తేలాల్సి ఉంది. కాగా, కొరోనా కారణంగా తీసుకుంటున్న ఆన్‌లైన్‌ ‌క్లాసులైతే పాఠశాలకు ప్రత్యమ్నాయంగా కనిపిస్తున్నాయే గాని, తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించినంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయన్నది సర్వత్రా వినిపిస్తున్న వాదన.

అధికార లెక్కల ప్రకారమే ఆన్‌లైన్‌, ‌డిజిటల్‌ ‌క్లాసుల పట్ల కేవలం 30 శాతం మందే శ్రద్ధ చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఎంత త్వరగా పాఠశాలలు తెరుచుకుంటే అంతేగా భావి భారత పౌరులైన పిల్లల భవిష్యత్‌ ‌మెరుగుపడే అవకాశంలేదు. దీంతో పాటు ప్రైవేటు పాఠశా)ల్లో పనిచేసే అధ్యాపక, ఆధ్యాపకేతర సిబ్బందికి తిరిగి ప్రాణం పోసినట్లు అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదకొండు వేల వరకు ప్రైవేటు పాఠశాలలుండగా వీటిల్లో దాదాపు రెండు లక్షల మంది అధ్యాపకలు, మరో లక్ష వరకు ఆధ్యాపకేతరులు ఉపాధి పొందుతున్నారు. యాజమాన్యాలు వీరిలో చాలామందికి దాదాపు పదినెలలకాలంగా వేతనాలివ్వని పరిస్థితి. సగం వేతనాలనైనా ఇవ్వాలని ప్రభుత్వ సూచనను కూడా వారు పట్టించుకోవడంలేదు. ఆన్‌లైన్‌ ‌క్లాసుల బోధన కోసం పాఠశాలకు వెళ్ళేందుకు కనీసం రిక్షా ఛార్జీలు కూడా లేని పరిస్థితిలో ప్రైవేటు ఉపాధ్యాయులున్నారు. ఈ పరిస్థితిలో పాఠశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురుచూస్తున్న వీరిని కొ•రోనా-2 మరింత కృంగదీస్తున్నది.

mandava ravindhar rao
మండువ రవీందర్‌ ‌రావు
గెస్ట్ ఎడిటర్‌

Leave a Reply