Take a fresh look at your lifestyle.

విద్యావాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా 12వేల మంది ఉన్నారని తమ  సమస్యలు పరిష్కరించాలని  సోమవారం ఖమ్మం డిఇఓకు వినతిపత్రం అందజేసినట్లు తెలంగాణ విద్యావాలంటీర్ల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షకార్యదర్శులు వాకదాని వీరభద్రం, కల్యాణ్‌కు మార్‌ ‌తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానమైన  విద్యార్హతలు గల తమను జిల్లాస్తాయిలో కలెక్టర్‌ ‌చైర్మన్‌గా నోటిఫికేషన్‌ద్వారా తీసుకోబడ్డామని చెప్పారు.

ఈ ప్రభుత్వం తమ గౌరవ వేతనం రూ. 8 వేల నుండి రూ. 12వేలకు పెంచారన్నారు. తమను 2020-21 ఏడాది కూడా కొనసాగించాలని, ఉద్యోగభద్రత కల్పించాలని కోరినట్లు చెప్పారు.ప్రస్తుతం రూ. 12వేలకు పనిచేస్తున్న తమపై తమ కు టుంబాలు ఆధారపడ్డాయని తమ వేతనాన్ని పెంచాలని కోరారు.

Leave a Reply