Take a fresh look at your lifestyle.

విద్యా నిలయాలూ అవినీతి అడ్డాలే ..!!

“ఉన్నత విద్య, సాంకేతిక విద్యను నియంత్రించడానికి ఎన్నో రకాల నియంత్రణ సంస్థలను ప్రభుత్వాలు నెలకొల్పాయి. యుజిసి, ఏఐసిటియి, ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియా, బార్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియా జాతీయా విద్యా నియంత్రణ మండలి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌ ‌బ్యూరో ఎన్నో నియంత్రణ సంస్థలను స్థాపించడానికి మాత్రమే పరిమితమై నియంత్రణ శూన్యమైంది. ఇవి చాలా వరకు లంచాల కేంద్రాలుగా తయారయ్యాయి. వీటన్నింటి స్థానంలో ఒకే ఒక జాతీయస్థాయి నియంత్రణ సంస్థను నెలకొల్పాలని ఆలోచన చాలాకాలం  నుండి జరుగుతున్నా నేటికీ కార్యరూపం దాల్చలేదు.”

రాష్ట్రంలో ప్రతి రోజు ఎక్కడో అక్కడ ఒక అవినీతి కేసు బయట పడుతోంది. లంచం తీసుకుంటూ అధికారులు, సిబ్బంది అవినీతి నిరోధక శాఖకు  పట్టుబడుతూనే ఉన్నారు. అవినీతిని సహించబోమని, కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా..మరోవైపు లంచాల వ్యవహారం సాగుతూనే ఉంది. వందల  కేసులు నమోదవుతున్నా పదుల సంఖ్యలో కూడా శిక్షలు లేవు. అనేక  కేసుల విచారణ దీర్ఘ నిద్రలోకి జారుకుంటూ ఏళ్ళతరబడి సాగుతున్నాయి. ఉద్యోగుల్లో భయంలేక అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోతున్నదని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అవినీతి కేసులు ఎక్కువగా రెవెన్యూ, మున్సిపల్‌, ‌పోలీస్‌, ‌పంచాయతీరాజ్‌, ‌న్యాయ విభాగ ఉద్యోగులూ అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారు.

విద్యాప్రమాణాలు దిగజారుతున్నాయి. వైద్య, ఇంజనీరింగ్‌, ‌ఫార్మసీ, ఉన్నత విద్య బోధించే విద్యా సంస్థలు కనీస మౌలిక వసతులు లేకున్నా విశ్వవిద్యాలయాలు తనిఖీల పేరుతో వేధించి తమ శైలిలో జేబులు నింపుకుంటున్న వ్యక్తులపై నిఘా కరువైంది. పుట్టగొడుగుల్లా   పుట్టుకొస్తున్న విద్యా సంస్థల అర్హతలు ఏమిటి. వాటికి అనుమతులెలా వస్తున్నాయి. దూరవిద్య అధ్యయన కేంద్రాలలో ప్రమాణాలు పాటించక అర్హత లేని అధ్యాపకుల మాటేమిటి.  పరీక్షల నిర్వాహణలో అక్రమార్కులకు అడ్డుకట్ట ఎప్పుడు? అవినీతి అంటే రెవెన్యూ, పోలీస్‌ ‌శాఖలేనా? విద్యానిలయాలు అవినీతి కేంద్రాలుగా తయారయ్యాయనేది నిర్వివాదాంశం. విద్యా సంస్థలలో అవినీతి చాపకిందనీరులా తయారైంది. విద్యా బుద్దులు నేర్పాల్సిన ఉన్నత విద్యా సంస్థలు కలుషితం అయ్యి ప్రమాణాలు దెబ్బతిని, అక్రమార్కులను పెంచిపోషిస్తుంది.

ఉన్నత విద్య, సాంకేతిక విద్యను నియంత్రించడానికి ఎన్నో రకాల నియంత్రణ సంస్థలను ప్రభుత్వాలు నెలకొల్పాయి. యుజిసి, ఏఐసిటియి, ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియా, బార్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియా జాతీయా విద్యా నియంత్రణ మండలి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌ ‌బ్యూరో ఎన్నో నియంత్రణ సంస్థలను స్థాపించడానికి మాత్రమే పరిమితమై నియంత్రణ శూన్యమైంది. ఇవి చాలా వరకు లంచాల కేంద్రాలుగా తయారయ్యాయి. వీటన్నింటి స్థానంలో ఒకే ఒక జాతీయస్థాయి నియంత్రణ సంస్థను నెలకొల్పాలని ఆలోచన చాలాకాలం  నుండి జరుగుతున్నా నేటికీ కార్యరూపం దాల్చలేదు.
ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చే శాఖల్లో ముఖ్యమైన రెవెన్యూ  అత్యంత అవినీతి శాఖగా ముద్ర పడింది. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లతో ముడిపడడంతో  కోట్ల రూపాయల డబ్బు చేతులు మారుతుంది. ఈ నేపథ్యంలో అనేక అవినీతి చర్యలు చోటు చేసుకున్న సంగతి తెలిసినదే. రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్‌ ‌లావణ్య, హైదరాబాద్‌ ‌షేక్‌ ‌పేట్‌ ఎమ్మార్వో సుజాత, అబ్దుల్లాపూర్‌ ‌మెట్‌ ‌తహశీల్దార్‌ ‌విజయ రెడ్డి సజీవ దహనం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. కీసర ఎమ్మార్వో నాగరాజు పట్టుబడటం..ఇవన్నీ..రెవెన్యూ శాఖలో అవినీతి బయటపడడమే. రెవెన్యూ శాఖలో ఎక్కువగా పట్టాదారు పాస్‌ ‌పుస్తకాల కోసం, మున్సిపల్‌ ‌శాఖలో ఇంటి నిర్మాణ అనుమతులు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులకులంచాలు. ఈ విషయంలో సెక్రటేరియట్‌ ‌స్థాయిలో ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలదే కీలక పాత్ర అనే• ఆరోపణలు ఉన్నాయి.  ప్రజలకు న్యాయం చేయాల్సిన కోర్టుల్లో పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్లు, క్లర్కులు అవినీతికి పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. పోలీస్‌ ‌శాఖలో ఉన్న అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సెంటర్‌ ‌ఫర్‌ ‌మీడియా స్టడీస్‌(‌సీఎంఎస్‌) ‌గతంలో నిర్వహించిన సర్వేలో పోలీసులు ప్రతి పనికీ డబ్బులు వసూలు చేస్తుంటారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఏసీబీ కేసుల్లో చిన్నస్థాయి ఉద్యోగులకే శిక్షలు పడుతున్నాయని, వారిపైనే చర్యలు తీసుకుంటున్నట్లు లెక్కలు చెప్తున్నాయి. రాజకీయ నేతల ద్వారా ఒత్తిళ్ళ వల్ల  ఏళ్ళతరబడి కేసులు నానుతున్నాయి. దేశ రక్షణ, విద్యార్థుల భవిష్యత్‌  ‌కాపాడాల్సిన విద్యా సంస్థలలో అవినీతి చాపకిందనీరులా విస్తరిస్తున్నది. విద్యా బుద్దులు నేర్పాల్సిన ఉన్నత విద్యా సంస్థలు కలుషితమై ప్రమాణాలు దెబ్బతిని అక్రమార్కులను పెంచిపోషిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ముఖ్యంగా ఉన్నత,  సాంకేతిక, వైద్య విద్య  ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఏంతైనా ఉంది.

image.png డా. సంగని మల్లేశ్వర్‌, ‌జర్నలిజం విభాగాధిపతి, కెయూ, 9866255355.
డా. సంగని మల్లేశ్వర్‌, ‌జర్నలిజం విభాగాధిపతి, కెయూ, 9866255355.

 

Leave a Reply