Take a fresh look at your lifestyle.

నల్గొండ జిల్లా కేంద్రంలో విద్యావాలంటీర్ ఆత్మ హత్య..

ఇబ్బందులు తట్టుకోలేక శనివారం రాత్రి నల్గొండ రైల్వేస్టేషన్ పరిధిలో రైలు క్రిందపడి పాలకురి శైలజ(30) ఆత్మహత్య కు పాల్పడింది.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన శైలజ భర్త ఔట్ సోర్సింగ్ ఉద్యోగం రెన్యూవల్ కాక జీతం లేక 4 ఏళ్ళ పాపకి తిండి పెట్టలేక పూటగడవక భర్త పడుతున్న ఆవేదనను చూసి శైలజ ఆత్మహత్య చేసుకున్నట్లు
తెలుస్తుంది.

కొరోనా మూలంగా 15 నెలలుగా జీతాలు లేకుండా జీవితాలను నెట్టకొస్తున్న విద్యావాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని TJS పార్టీ స్టూడెంట్ వింగ్ స్టేట్ కన్వినర్ నిజ్జన రమేష్, ప్రభుత్వాన్ని
కోరారు.తణమే విద్యావాలంటీర్లను రెన్యవల్ చేసి విధుల్లోకి తీసుకోని ,జీతాలివ్వాలని నిజ్జన రమేష్ డిమాండ్ చేశారు.

వివిధ రంగాలలో ఉపాధి కోల్పోయిన వారికి ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి ప్రకటించి ఆదుకోవాలని నిజ్జన రమేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ కొరోన కాలంలో ఉపాధి కోల్పోయిన వారికి నెలకు 7500 రూపాయలు ఇచ్చిఆదుకోవాలని కోరారు.

Leave a Reply