Take a fresh look at your lifestyle.

పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువే !

ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలన్నదే తపన
జగనన్న విద్యాదీవెన కింద తల్లుల ఖాతాల్లోకి నగదు జమ
అమరావతి, జూలై 29 : పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే.. ప్రతి అడుగులోను విద్యార్థుల భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నానని సిఎం జగన్‌ అన్నారు. ప్రతీ ఒక్కరూ బాగా చదువుకోవాలనేది నా తాపత్రాయం అన్నారు. ఇందులో భాగంగానే జగనన్న విద్యా దీవెన అనే మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ ఏడాదికి గాను జగనన్న విద్యా దీవెన రెండో విడత సొమ్మును ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.693.81 కోట్లను విడుదల చేశారు. నిరుపేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో, బకాయిలు లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్ ‌మెంట్‌ ఇస్తున్నారు. ఏ తైమ్రాసికానికి ఆ తైమ్రాసికమే ఆ పిల్లల తల్లులకే చెల్లించి, వారే కాలేజీలకు ఫీజులు కట్టేలా చేసి పేదల ఇంట విద్యా జ్యోతులు వెలిగిస్తున్నారు. విద్యా దీవెన కానుక రెండో విడత సొమ్ము విడుదల కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్‌ ‌మాట్లాడుతూ.. ’ తల్లిదండ్రులకు భారం లేకుండా విద్యాదీవెన అమలు చేస్తున్నాం.

దేవుడి ఆశీస్సులతోనే ఇదంతా చేయగల్గుతున్నాం. ప్రతి పేద విద్యార్థికి చదువు అందుబాటులోకి రావాలన్నదే మా ప్రభుత్వం లక్ష్యం. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థుల భవిష్యత్తు కోసం 100 శాతం ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఇస్తున్నాం’ అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దగ్గర 33శాతం నిరక్షరాస్యత ఉంది. బ్రిక్స్ ‌దేశాలతో పోలిస్తే మన దేశంలో.. ఇంటర్‌ ‌తర్వాత డ్రాప్‌ అవుట్స్ ‌సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితిని మార్చడం కోసం అనేక పథకా లను ప్రవేశ పెట్టాం. తల్లిదండ్రులకు భారం లేకుండా వసతి దీవెన అందిస్తున్నాం. ప్రతి మూడు నెలలకోసారి తల్లుల ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తున్నాం. తల్లులే నేరుగా ఫీజులు చెల్లించేలా చర్యలు తీసుకున్నాం. విద్యా దీవెనతో ఇప్పటివరకు రూ.5,573 కోట్లు అందించాం.

అమ్మఒడి, విద్యాకానుక, మనబడి నాడు-నేడు కింద..మొత్తం రూ.26,677 కోట్లు ఖర్చు చేశాం’ అని సీఎం జగన్‌ ‌తెలిపారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ‌కోసం ఏ విద్యార్థి ఎదురుచూడకూడదు.. ఏ తల్లి అప్పులు చేయకూడదన్నదే సీఎం వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ‌పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో పెను విప్లవానికి నాంది పలుకుతూ.. అతి పెద్ద సామాజికి మార్పుకు శ్రీకారం చుడుతూ ఉన్నత విద్య, మెరుగైన సమాజానికి మెట్టు అనే ఆలోచనతో సీఎం జగన్‌ ‌రెండు సంవత్సరాలుగా అక్షర యజ్ఞం చేస్తున్నారు. పేద ప్రజల ఇంట విద్యా జ్యోతులు వెలిగిస్తున్నారు. ఈ పథకం ద్వారా పూర్తి ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ‌పొందుతున్న విద్యార్థులకు ఇదో వరం. గతంలో అరకొర ఫీజులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అవి కూడా సరైన సమయానికి అందించలేదు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.693 కోట్లు జమ చేశాం. రెండో విడతగా సుమారు 11 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరుతుంది. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా చెల్లించాం అని తెలిపారు.

Leave a Reply