Take a fresh look at your lifestyle.

సామాజిక విలువలను పెంపొందించే విద్యనందించాలి!

 
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 
విద్యార్థులకు సామాజిక విలువలను పెంపొందించే విద్యను అందించడంలో పాఠశాల నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు పాఠ్య ప్రణాళిక ఉండాలని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఆదివారం వరంగల్ లోని ఆంధ్ర విద్యా వర్దిని (ఏ వి వి) విద్యా సంస్థలు స్థాపించి 75 ఏళ్ళు అయిన సందర్భంగా మూడు రోజులపాటు నిర్వహించు ప్లాటినం జూబ్లీ ఉత్సవాల ప్రారంభ సమావేశానికి ముఖ్యఅతిథిగ వెంకయ్య నాయుడు హాజరైనారు. ఈ సమావేశానికి ఏవి వి విద్యాసంస్థల అధ్యక్షులు డాక్టర్ నాగ బండి నరసింహారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కాకతీయ రాజులు పరిపాలించిన గొప్ప భూభాగం వరంగల్ అని కాకతీయులు సుపరిపాలన అందించడంలో వారు చూపిన చొరవ ముందు తరాలకు ఆదర్శమని ముఖ్యంగా వ్యవసాయ అభివృద్ధి కోసం నిర్మించిన చెరువులు ముందు తరాలకు ఉపయోగపడుతున్నాయని ప్రస్తుతం నీటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం చూపెడుతున్న ఆదరణ ఎంతో గొప్పదని ఆయన అన్నారు వరంగల్ అనగానే సి కె ఎం (చందా కాంతయ్య) గుర్తుకు వస్తారని ఆయన అన్నారు. నాటి నిజాం పాలకులు తెలుగు భాష పట్ల అనుసరిస్తున్న విధానానికి తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి భాష అభివృద్ధి కోసం అప్పటి పాలకులను ఒప్పించి వరంగల్ లో తెలుగు భాష అభివృద్ధి కోసం 1945లో పాఠశాలను ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు. తెలంగాణ చరిత్రలో వరంగల్ కు ఎంతో ప్రాధాన్యత ఉందని దాశరథి రంగాచార్య , ఆచార్య జయశంకర్, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జన్మనిచ్చిన గడ్డం ఏ కాకుండా సంస్కృతిక ఆధ్యాత్మికం పెంపొందించే వరంగల్ నగరానికి తలమానికంగా నిలిచిన వేయి స్తంభాల గుడి, విద్యాపరంగా కాకతీయ విశ్వవిద్యాలయం, సాంకేతిక విద్యా సంస్థ, కాలోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, గొప్ప చరిత్ర చాటుతున్నాయి అని ఆయన అన్నారు. వరంగల్ అంటే నాకు చాలా ఇష్టమని విద్యార్థి దశ నుండి వరంగల్ వచ్చి పోయే వాడ్ని అని ఆయన అన్నారు చందా కాంతయ్య విద్యాభివృద్ధి కోసం చేపట్టిన చర్యలు ఈ ప్రాంతవాసుల అదృష్టమని కొన్నారు. వ్యవసాయానికి ప్రధానంగా దోహదపడే చెరువులు పరిరక్షించడం వల్ల సాగునీటి తాగునీటి పశువులకు నీళ్లు అందించడానికి పూర్వికులు ముందుచూపుతో వ్యవహరించేవారని కానీ కాలక్రమంలో అవి అంతరించి పోయాయని ప్రస్తుతం వాటిని పునరుద్ధరించడం లో ముందుకు వస్తున్నామని ఆయన అన్నారు. భారతదేశం వ్యవసాయక దేశం అని నీటి పారుదల రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వరంగల్కు స్మార్ట్ సిటీగా, హెరిటేజ్ సిటీగా గుర్తింపు ఇచ్చానని, ఈ ప్రాంతాన్ని అమీర్ ఖుస్రూ, మార్కోపోలో వంటి విదేశీ యాత్రికులు సందర్శించిన ఘనత వరంగల్కు ఉందన్నారు వరంగల్ గొప్ప విద్యా కేంద్రం అని తెలుగు భాష అభివృద్ధి లో సుబేదారి లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎనలేని కృషి చేసిందని వెంకయ్య నాయుడు కొనియాడారు.75 ఏళ్ల క్రితం ఆంధ్ర విద్యాభివృద్ధి కోసం నిజాం ఏలుబడిలో ఉర్దూ భాష అధికార భాషగా ఉన్న సమయంలో తెలుగు భాషను పెంపొందించడానికి చంద్రకాంత ఎటువంటి మహా నాయకులు ముందుకు వచ్చారని ఆయన అన్నారు. తెలుగు భాష బోధనా వికాసం ఎంతో అవసరమని. మాతృభాషను మర్చిపోకూడదని మాతృభాషలో చదువుకున్నవారు ఎందరో గొప్ప నాయకుడిగా ఎదిగారని ఇందుకు ఉదాహరణ నేను ప్రస్తుత ప్రధానమంత్రి ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. మాతృభాషలో పరిపాలన కొనసాగాలని అప్పుడే సామాన్య మానవునికి పరిపాలన విధానం తెలిసిపోతుందని ఆయన పేర్కొన్నారు. మాతృభాషను పక్కనపెట్టి పరభాషను అధికంగా ప్రేమిస్తున్నానని తెలుగు భాష నేర్చుకుంటే ఉద్యోగం రాదని పైకి రారా అని మూఢనమ్మకమని ఆయన అన్నారు మాతృభాష కళ్లు వంటివి అని పరభాషా కళ్లద్దాలు అని ఆయన అన్నారు. కెసిఆర్ తెలుగు భాష పట్ల ఎంతో మక్కువ చూపుతున్నారని మాతృభాషను విడనాడి తే మనకు మనం అవమానించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులలో విషయ పరిజ్ఞానం పెంపొందించడంలో మాతృభాష ఎంతగానో దోహదపడుతుందని 1946లో నాగపూర్ విశ్వవిద్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్న మాటలు ఎంతో విలువైన అని ఆయన పేర్కొన్నారు. మానవ జీవన వికాస లో నైతిక విలువలు ఎంతో అవసరమని విద్యార్థులకు చిన్నప్పటి నుండే నైతిక విలువలను పెంపొందించే విధంగా విద్యను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు మాతృభాషలోనే విద్యాబోధన జరిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని వెంకయ్య నాయుడు సూచించారు. వేద కాలం నుండి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు నైతిక విలువలు ప్రపంచానికి మార్గదర్శకంగా ఉపయోగపడుతున్నాయని ఆయన అన్నారు ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ విలువలు అడుగంటి పోతున్నాయని, భారతదేశంలో 65 శాతం యువశక్తి ఉందన్నారు, గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు గా ఉపయోగపడుతున్నాయని గ్రామాలలోని కమ్మరి కుమ్మరి వడ్రంగి మంగలి చాకలి వృత్తి కళాకారులు ఎంతో గొప్ప వ్యక్తులని వారికి వృత్తి నైపుణ్యతను పెంపొందించి మళ్లీ గ్రామీణ జీవన విధానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా యువత పెడదారి పడుతుందని ఇది భవిష్యత్ తరాలకు ఇబ్బందికరంగా మారుతుంది అని ఆయన పేర్కొన్నారు. భారతీయులు వసుదైక కుటుంబ వ్యవస్థను పెంపొందించాలని దీనిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కులాలు వారి వృత్తిని పరిరక్షించుకోవడానికి తాడపత్రి పడుతున్నారని నేటి యువతరం వాటిని అనుసరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేటి రాజకీయాలు కుల పునాదుల పై ఎదుగుతుందని ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న ప్రజాస్వామ్య వ్యవస్థ గా చెప్పుకుంటున్న భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని అయితే కులాలతో రాజకీయాలను ముడిపెట్టొదని, రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని ఎంతటి గొప్ప వారైనా ప్రజా సంక్షేమాన్ని విడనాడి తే భవిష్యత్తులో రాజకీయ గుర్తింపు లేకుండా పోతారని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వం కలిసిమెలిసి అభివృద్ధివైపు దూసుకుపోవాలని ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. వసుదైక కుటుంబంగా చెప్పుకుంటున్న భారతదేశంలో స్త్రీకి సమాన స్థాయి కల్పించాలని, భారతదేశంలోని నదులన్నీ ఆడవారి పేరు లేనని ఇది ప్రధానంగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యువత విశాల దృక్పథంతో వ్యవహరించాలని ఆయన సూచించారు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే అధికారం ప్రజలకు ఉంటుందని దీనిని శాంతియుతంగా చేపట్టాలి కానీ విధ్వంసానికి ఉపయోగించకూడదని ఆయన సూచించారు వేదాలు పురాణాలు ఆధ్యాత్మిక విధానాలు భారతదేశానికి పెట్టని కోటగా వెలుగొందుతున్నాయి అని. సమాజ సేవ చేయడంలో ఎంతో ఆనందం ఉంటుందని సొంత లాభం కొంత మాని సమాజ సేవకు పాటు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఏ వి వి విద్యా సంస్థ తమకు రాజకీయ మనుగడ ను సూచించిందని ముఖ్యంగా క్రమశిక్షణ పెంపొందించడంలో విద్యా సంస్థ పాత్ర ఎనలేనిదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఎంపీలు డాక్టర్ బండ ప్రకాష్, పసునూరి దయాకర్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, వరంగల్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ వినయ భాస్కర్ నగర మేయర్ గుండా ప్రకాష్ డాక్టర్ మోహన్ కందా, డాక్టర్ ఉపేంద్ర శాస్త్రి, డాక్టర్ భుజంగ రెడ్డి చంద విజయ్ కుమార్, తో పాటు నగర ప్రముఖులు, పూర్వ విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply