Take a fresh look at your lifestyle.

అం‌దరికీ విద్య ప్రభుత్వ లక్ష్యం: విద్యాశాఖమంత్రి సబిత

Multipurpose High School

  • ఈచ్‌వన్‌ ‌టీ•చ్‌వన్‌లో అందరూ భాగస్వాములు కావాలి
  • సిద్దిపేట జిల్లా మల్టిపర్పస్‌ ‌హైస్కూల్‌
  • ‌ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో విద్యాశాఖమంత్రి సబిత

అందరికీ విద్య అందించడమే సిఎం కేసీఆర్‌ ‌నేతృత్వంలోని తెరాస ప్రభుత్వ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (మల్టిపర్పస్‌ ‌హైస్కూల్‌) 75 ‌వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం పాఠశాల పూర్వ విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ..ఎందరో మహనుభావులకు, రాజకీయ నాయకులకు, విద్యావేత్తలు, కవులు, కళాకారులకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఉత్సవాలల్లో పాల్గొన్న పూర్వ విద్యార్థులు నాటి అనుభవాలను గుర్తు చేసుకొంటు మాట్లాడుకోవడం ఎంతో అనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రాష్ట్రంలో విద్యావవస్థ బలోపేతానికి కృషిచేస్తున్నారన్నారు. అదేవిధంగా ప్రతిఒక్కరు చదుకోవాలనే ఉద్దేశ్యంతో సిఎం కేసీఆర్‌ ‌ప్రవేశ పెట్టిన ఈచ్‌వన్‌ ‌టీచ్‌వన్‌లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సామాజిక సేవా కార్యక్రమాలల్లో అందరు భాగస్వాములై రాష్ట్ర పురోగాభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. పాఠశాల పూర్వ విద్యార్థి, మెదక్‌ ఎం‌పి కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ..పాఠశాలతో తనకు ఉన్న అనుబంధాన్ని, గురువులను పేరుపేరునా గుర్తు చేసుకున్నారు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల అభ్యున్నతికి సహకరిస్తానని హామీనిచ్చారు. మంత్రి తన్నీరు హరీశ్‌రావు సహకారంతో పాఠశాలలను కార్పోరేట్‌ ‌పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దుతామన్నారు. జిల్లా పరిషత్‌ ‌చైర్‌పర్సన్‌ ‌రోజాశర్మ మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి సిఎం కేసీఆర్‌ ‌నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందన్నారు. జిల్లా మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రభుత్వ పాఠశాలలో విద్యబలోపేతానికి కృషిచేస్తున్నారన్నారు.

వారంలో ఒక ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి బోధన తీరును పరిశీలిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం పదవ తరగతి ఫలితాలల్లో 2వ స్థానంలో నిలిచిన జిల్లాను ఈఏడు ప్రథమస్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ..ఎందరో మేధావులకు విద్యాబుద్దులు నేర్పిన పాఠశాల మల్టీపర్పస్‌ ‌పాఠశాల అన్నారు. ఉపాధ్యాయ పదోన్నతుల విషయంలో ప్రభుత్వం దృష్టిసారించి ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని విద్యాశాఖ మంత్రిని కోరారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, ఎమ్మెల్సీ పారుఖ్‌హుస్సేన్‌ ‌పాఠశాలలో చదువుకున్న రోజులను గుర్తు చేసుకొని విద్యాబుద్దులు నేర్పిన ఉపాధ్యాయులను, పాఠశాల అవరణలో అడుకున్న ఆటలను గుర్తు చేసుకొని పులకరించిపొయ్యారు. సాహిత్య అకాడమి చైర్మన్‌ ‌నందిని సిధారెడ్డి మాట్లాడుతూ..దేశానికి స్వాతంత్రం రాకముందునించి మల్టీపర్పస్‌ ‌ప్రభుత్వ పాఠశాల ఎంతో మందికి విద్యానందించిందన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థి మాజీ ఎంపీ సొలిపేట రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..పాఠశాలను చూస్తుంటే నాటి జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయన్నారు. 1945 నుండి 1951 వరకు పాఠశాలలో చదువుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. ప్రతిఒక్కరికి విద్య ఎంతో అవసరమన్న అయన తన వ్యక్తిత్వం ఉన్నతంగా తీర్చిదిద్దడంలో పాఠశాల ఉపాధ్యాయులు పాత్ర ఎంతో ఉందని రామచంద్రారెడ్డి అన్నారు. ప్లాటీనం జూబ్లీ ఉత్సావాలల్లో జెసి పద్మాకర్‌, ‌జిల్లా విద్యాధికారి రవికాంత్‌రావు, మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌కడవేర్గు రాజనర్సు, పూర్వ విద్యార్థి పూజల వెంకటేశ్వర్‌రావు ప్రసంగించారు. ఈకార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, వేలేటి రాధాకృష్ణశర్మ, అత్తర్‌ ‌పటేల్‌, ‌చిప్ప ప్రభాకర్‌, ‌లక్కరుసు ప్రభాకర్‌వర్మ, మోహన్‌లాల్‌, ‌రాందాస్‌, ‌వినోద్‌మోధాని, అకుల పాండు, మార్క సతీష్‌గౌడ్‌ ‌తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌కడవేర్గు రాజనర్సు, కౌన్సిలర్‌ ‌చిప్ప ప్రభాకర్‌, ‌పాఠశాల పూర్వ విద్యార్థులు, ప్రధానో పాధ్యాయుడు సంపతి భగవంతయ్యలు కలిసి గొల్లభామ చీరను బహూకరించారు. అనంతరం మల్టిపర్పస్‌ ‌హైస్కూల్‌ ‌సావనీర్‌ను మంత్రి అవిష్కరించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply