Take a fresh look at your lifestyle.

అక్షర తెలంగాణ వైపు అడుగులు ప్రణాళికలు సిద్ధం చేసిన విద్యాశాఖ

Education Department Plane to Akshara Telangana
సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఈచ్‌ ‌వన్‌ ‌టీచ్‌ ‌వన్‌

తెలంగాణ రాష్ట్రాన్ని అక్షరతెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.తెలంగాణలో నిరక్షరాస్యులు ఉండరాదనే సంకల్పంతో, నూతన సంవత్సరం ప్రారంభం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌,‌హోచ్‌మెన్‌ ‌స్పూర్తితో, ఈచ్‌వన్‌టీచ్‌వన్‌ అనే నినాదాన్ని విద్యావంతులకు అందించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని నిరక్షరాస్యులందరినీ, అక్షరాస్యులను చేయాలని సంకల్పంతో, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలను రూపొందించింది. వయోజనవిద్యాశాఖ, సాక్షరభారత్‌, అర్థగణాంకశాఖ, పాఠశాలవిద్య, కళాశాల విద్యాశాఖల సమన్వయంతో ఈ కార్యాచరణను అమలు చేస్తారు. ఈ ఆలోచనలకు కార్యరూపం ఇవ్వాలనే ఆశయంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నూతన సంవత్సరం ప్రారంభం రోజున ఈచ్‌వన్‌టీచ్‌వన్‌ ‌నినాదాన్ని తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. రాష్ట్రంలో 53లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నారని వయోజనశాఖ ఇచ్చిన నివేదికలను తెలియచేస్తున్నాయి. శాసనసభబడ్జెట్‌ ‌సమావేశాలు, విద్యార్థులకు పరీక్షలు పూర్తయిన తర్వాత తెలంగాణలోని ప్రతీ ఇంటికి ఈచ్‌వన్‌టీచ్‌వన్‌ ఉద్యమ నినాదాన్ని చేరవేయనున్నారు. ఇదివరలో వయోజనవిద్యాశాఖ ద్వారా చాలా ప్రయత్నాలు జరిగినప్పటికీ అనుకున్నంతస్థాయిలో ఫలితాలను సాధించలేకపోయారు.ఈ ఉద్యమంలో విద్యావంతులంరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు నిచ్చారు. ప్రైవేట్‌పాఠశాలు,కళాశాలలకు చెందిన యాజమాన్యాలు, పీఆర్‌టీయూ-టీ. ఎస్‌,‌టీఎస్‌టీయూ, పీఆర్‌టీయూ వంటి ఉపాధ్యాయసంఘాలు, స్వచ్చందంగా తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యతా ఉద్యమంలో పనిచేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేశాయి.

తొలిదశలో 33 జిల్లాలలోని నిరక్షరాస్యుల జాబితాలను రూపొందించి, వారి దగ్గరికి వెళ్లి అక్షరాలను నేర్పే కార్యాచరణను అమలు చేస్తారు.విద్యార్థులు వారి తల్లిదండ్రులు, వారి తాతలు విద్యావంతులు కానట్లయితే విద్యార్థులే వారందరినీ అక్షరాస్యులను చేయాలని పాఠశాల విద్యాశాఖ కార్యాచరణను ఇచ్చింది. ఈ దిశలో ఇప్పటికే 1800 పాఠశాలలు తమ పాఠశాలల విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని ఇచ్చాయి.1లక్షా 64వేల మంది నిరక్షరాస్యులను నమోదు చేశారు. ప్రతీమండలంలో పంచాయత్‌రాజ్‌, ‌వయోజనవిద్య, రెవెన్యూ, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కమిటీని ఏర్పాటు చేస్తారు. అక్షరాస్యతా ఉద్యమానికి అనుగుణంగా కార్యాచరణను అమలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ సాక్షరభారత్‌ ‌పథకాన్ని 2019 మార్చి నుంచి అమలు చేయడంలేదు. రాష్ట్రంలో సాక్షరభారత్‌ ‌కొద్దోగొప్పో ఫలితాలను ఇచ్చింది. సాక్షరభారత్‌కు ఖర్చు చేసే నిధులను రాష్ట్రానికి ఇచ్చినట్లయితే అక్షరాస్యతా ఉద్యమాన్ని ఇంకా పకడ్బందీగా అమలు చేస్తామని, తమ రాష్ట్రాన్ని అక్షర తెలంగాణగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంతి్ర 2018లోనే కేంద్రానికి నివేదించారు.వేసవిసెలవుల్లో అక్షరాస్యతా ఉద్యమ కార్యాచరణను ప్రతీ పల్లెకు తీసుకపోనున్నారు. కేరళరాష్ట్రంలో 80శాతం విద్యావంతులు ఉన్నారు. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా విద్యావంతుల రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ పెద్దల సంకల్పం.

Leave a Reply