Take a fresh look at your lifestyle.

సంక్షోభంలో ఆర్ధిక వ్యవస్థ ..!

“1991 నుంచి ఆర్ధిక సంస్కరణల పేరుతో ప్రయివేటీకరణ మన ఆర్ధిక విధానం అయ్యింది. ఈ ఏడు మన జాతీయ ఆదాయం వృద్ధి రేటు అతి తక్కువగా 1.4% నమోదు అయ్యింది. ఈ సమయంలో పి వి నరసింహారావు ప్రధాని మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండగా మన దేశానికి IMF …వరల్డ్ బ్యాంకుల నుండి రుణాలు వచ్చాయి. 2000 నుంచి 2001 వాజపేయి ప్రధానిగా వున్నప్పుడు మన జీడీపీ 3.9% . 2011 నుండి 2012 స్కాముల యుగంలో జీడీపీ 5.5% .మోడీ ప్రధాని అయినాక అత్యధిక జీడీపీ 2018లో తోలి మూడు నెలల జీడీపీ 8.2% గా నమోదు అయ్యింది. ఇక్కడి నుండి జీడీపీ పడిపోవటం మొదలు అయ్యింది. 2019లో తోలి మూడు నెలల జీడీపీ మైనస్ 5.2% గా పడిపోయి నమోదు అయిపోతూ నేడు జీడీపీ -23.9% గా నమోదు అయ్యింది. అంటే మిశ్రమ ఆర్ధిక విధానం..ప్రైవేటు ఆర్ధిక విధానము అనుభవం మనకి వచ్చింది. ప్రస్తుతం మనకి ఈ రెండు ఆర్ధిక వ్యవస్థలు ఇచ్చిన అనుభవాలు మిగిలి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మిగిలాం..”

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి , న్యూ దిల్లీ: ప్రపంచంలో అత్యంత దారుణమైన ఆర్ధిక వ్యవస్థ కలిగిన దేశంగా నేడు భారత్ వుంది. తరవాత స్థానంలో భారత్ ను 200 ఏళ్ళు పరిపాలించిన బ్రిటన్ వుంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ్యూస్ GDP అంటే జాతీయ ఆదాయం ఉదాహరణకు 100 రూపాయలు అనుకుంటే అందులో 23.9 రూపాయలు తగ్గిపోయింది. అసలు జాతీయ ఆదాయం ఎలా లెక్క కడుతుంది ప్రభుత్వం చూద్దాం.. GDP = C + I + G + NX.

  • C అంటే కన్సంప్షన్. దీని ద్వారానే ప్రభుత్వ ధనాగారానికి అధిక సంపద వస్తుంది. కన్సంప్షన్ అంటే మనదేశంలో ఉన్న ప్రధాని మొదలుకొని అంబానీతో పటు ఈ దేశంలో బిచ్చమెత్తుకు బ్రతికే మనిషి..అంటే ప్రతి పౌరుడు తన జీవితానికి కావలిసిన సరుకులు కొనేటప్పుడు చెల్లించే డబ్బుని కన్సంప్షన్ అని ప్రభుత్వం చెబుతుంది. ఈ చెలింపులలో జనరేట్ అయ్యే ఇండైరెక్ట్ టాక్స్ ద్వారా జాతీయ ఆదాయానికి సమకూరేది అత్యధికం. మొత్తం జాతీయాదాయం వంద రూపాయలు అయితే సగం ఇక్కడి నుంచే వస్తుంది. జాతీయ ఆదాయంలో కన్సంప్షన్ శాతం 56.4% . కరోనాకి ముందే మొత్తం ఆటో ఇండస్ట్రీ కూలిపోయి..రియలెస్టేట్ కూలిపోయి ఆర్ధిక వ్యవస్థ కుదేలు అయిన విషయం మనకి తెలిసిందే . ఇప్పుడు కరోనా లాక్ డౌన్ తో ప్రజలు నిరుద్యోగంలో పడి చేతిలో డబ్బులేని వారీగా నిలబడిపోయి జాతీయ ఆదాయాన్ని సమకూర్చలేకపోయారు.
  • I అంటే ఇండస్ర్టీ లేదా కార్పరేట్ కంపెనీలు. కన్సంప్షన్ తర్వాత ప్రబుత్వ ధనాగారానికి అధికంగా 32% నిధులు ఇండస్ర్టీ లేదా కార్పరేట్ కంపెనీలు అందిస్తాయి. ఈ కంపెనీలు భారీ పెట్టుబడులు సొంత జేబులనుచి తీయకుండా భారీగా బ్యాంకులనుంచి లోన్లు తీసుకుని కంపెనీలు పెట్టమని మొదలు వేసి నష్టాలు వచ్చాయి అని ఎలా ప్రజల డబ్బును తమ బొక్కసాలలోకి తీసుకుపోతాయో మనకి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ అనే పేరుతో శ్రామికులను ఒట్టి చేతులతో వీధిలో పడేసి.. కొనేవాళ్ళు లేరంటూ ఉత్పత్తి ఆపేసి పెట్టుబడులు పెట్టకుండా సమాజానికి చెందాల్సిన డబ్బుని అదిమి పట్టుకు కూర్చున్నారు.
  • మూడవది G అంటే ప్రభుత్వం పెట్టే ఖర్చు. దీని నుంచి 11% జాతీయ ఆదాయానికి సమకూరుతుంది. ప్రభుత్వం తన పరిశ్రమలలో ఉత్పత్తి చేసే వస్తువులు..సేవలు..వీటి నుంచి కొంత ఆదాయం వస్తుంది.
  • చివరిగా NX అంటే నెట్ ఎక్సపోర్ట్స్ ఎగుమతులు మైనస్ దిగుమలు చేయగా మిగిలేదే నెట్ ఎక్సపోర్ట్స్.మనం దిగుమతులు చేసే దేశం కనుక దీని నుంచి సాధారణంగా జాతీయ ఆదాయానికి సమకూరేది తక్కువ. ప్రస్తుతం దేశంలో డిమాండ్ తగ్గిపోయి దిగుమతులు బాగా తగ్గి ఎగుమతులు అధికంగా కనిపిస్తున్నాయి. దీన్ని వాపుగా తీసుకోవాలే కానీ బలుపుగా తీసుకోకూడదు..

ఇలా లెక్క కట్టే జాతీయ ఆదాయం మన దేశంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ తీరుగా ఉందో చూద్దాం..

స్వతంత్రం వచ్చాక ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు అని ఎకనామిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. పార్లమెంటుకి రెండవ లోక్ సభ ఎన్నికలు జరిగిన 1957 నుంచి 1958 ఆర్ధిక సంవత్సరంలో మన జాతీయ ఆదాయం మైనస్ 1.2 % . చైనా యుద్ధం ,పాక్ యుద్ధం చుసిన ఏడాది 1965 నుంచి 1966లో మన జాతీయ ఆదాయం మైనస్ 2.6% . ఇందిరాగాంధీ గరీబీ హటావో అని నినాదం ఇచ్చిన ఏడాది 1972 నుంచి 1973 లో మన జాతీయ ఆదాయం మైనస్ 0.6% .ఇందిరా విధించిన ఎమర్జెన్సీ తర్వాత 1979 నుంచి 1980 సంవత్సరంలో మన దేశ జాతీయ ఆదాయం మైనస్ 5.2% . ఇక్కడివరకు మిశ్రమ ఆర్ధిక విధానాలు అమలు అయినాయి. 1991 నుంచి ఆర్ధిక సంస్కరణల పేరుతో ప్రయివేటీకరణ మన ఆర్ధిక విధానం అయ్యింది. ఈ ఏడు మన జాతీయ ఆదాయం వృద్ధి రేటు అతి తక్కువగా 1.4% నమోదు అయ్యింది. ఈ సమయంలో పి వి నరసింహారావు ప్రధాని మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండగా మన దేశానికి IMF …వరల్డ్ బ్యాంకుల నుండి రుణాలు వచ్చాయి. 2000 నుంచి 2001 వాజపేయి ప్రధానిగా వున్నప్పుడు మన జీడీపీ 3.9% . 2011 నుండి 2012 స్కాముల యుగంలో జీడీపీ 5.5% .మోడీ ప్రధాని అయినాక అత్యధిక జీడీపీ 2018లో తోలి మూడు నెలల జీడీపీ 8.2% గా నమోదు అయ్యింది. ఇక్కడి నుండి జీడీపీ పడిపోవటం మొదలు అయ్యింది. 2019 లో తోలి మూడు నెలల జీడీపీ మైనస్ 5.2% గా పడిపోయి నమోదు అయిపోతూ నేడు జీడీపీ -23.9% గా నమోదు అయ్యింది. అంటే మిశ్రమ ఆర్ధిక విధానం..ప్రైవేటు ఆర్ధిక విధానము అనుభవం మనకి వచ్చింది. ప్రస్తుతం మనకి ఈ రెండు ఆర్ధిక వ్యవస్థలు ఇచ్చిన అనుభవాలు మిగిలి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మిగిలాం..

ఆర్ధికంగా మనం ఏ పరిస్థితిలో ఉన్నామో చూద్దాం..

నిర్మాణ రంగం –50%, వాణిజ్యం, హోటళ్ళు, ఇతర సేవలు –47%, మేనిఫ్యాక్చరింగ్ –39% , మైనింగ్ –23% లతో ఈ రంగాలు నష్టాన్ని చవి చూస్తున్నాయి. దేశంలో గరిష్టంగా కొత్త ఉద్యోగాలు సృష్టించే రంగాలు ఇవి. అటువంటి ఇవి నష్టాల్లో వున్నాయి అని మనం గమనించాలి. ఈ రంగాలలో ప్రతి రంగం కుదేలు అయిపోయి ప్రజలు ఉద్యోగాలు కోల్పోయేలా చేస్తున్నాయి. మరి మనం కోలుకోవటం ఎలాగ..ఉపాధి క్షీణించడం అడ్డుకోవటం ఎలాగ..? నిరుద్యోగం నిలుపుదల చేసేది ఎలాగ ..? అని ప్రశ్నించుకుంటే ..మనకు దొరికే సమాధానం పుడమిలో ఉంది. కొనేవారు లేరని ప్రొడక్షన్ నిలుపుకుని పారిపోయే..కేవలం లాభం కోసం ఉత్పత్తి చేసే కార్పొరేట్ కంపెనీలపై ఆధారపడే కన్నా, వ్యవసాయ రంగం ఇంత కష్ట కాలంలో కూడా 3.5% గ్రోత్ చూపింది…మనిషి బతికున్నతకాలం తిండి కావాలి…మనదేశంలో కేవలం 27 శాతం రైతులకి మాత్రమే కాస్తో కూస్తో వ్యవసాయానికి సంబందించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం ఇచ్చింది ఇంతవరకు. ఈ సమయంలో భూమిని జాతీయకరించి సేంద్రియ వ్యవసాయం ప్రభుత్వం తలపెట్టి…దీనికి కావలసిన డబ్బు భారీ వెల్త్ టాక్స్ వేసి తీసుకు వస్తే ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కుతామో అని ప్రభుత్వం ఆలోచిస్తే మేలు. రివర్స్ మైగ్రేషన్ జరిగి గ్రామాలలో వున్న వారికి ఉపాధి దొరుకుతుంది. పర్యావరణం రక్షణ సాధ్యం అవుతుంది. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించేలాగా మనం ఒత్తిడి తేగలమా..?.

Leave a Reply