- నేటికీ అనుసరణీయం..మార్గదర్శకం
- దార్శనిక నేత..ఆయనలో అనేక పార్శ్వాలున్నాయన్న వక్తలు
- గాంధీభవన్‌లో పివి శతజయంతి వేడుకలు ప్రారంభం
పివి సంస్కరణలే దేశానికి ఆదర్శంగా నిలిచాయని, ఆయన మనకు మార్గదర్శి అని పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పివి నిర్దేశం కారణంగానే దేశం ఆర్థిక పురోగతి సాధించిందన్నారు. గాంధీభవన్‌లో పివి శతజయంతి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దార్శనిక నేత పివి అని అన్నారు. ఆయన అనుసరించిన విధానాలు ఎప్పుడూ అవసరమని అన్నారు. కేంద్రం వ్వయసాయ చట్టాలతో రైతులను ఆడ్డుకుంటున్నదని మండిపడ్డారు. మాజీమంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ పివి దార్శనిక నేత అన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీవాడు కావడం మనకంతా గర్వకారణమని అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావులో అనేక పార్శ్వాలు ఉన్నాయని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ అన్నారు. ఇందిరా భవన్‌లో సోమవారం జరిగిన పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ.. మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడిపిన పీవీ.. ఉమ్మడి ఏపీ సీఎంగా పూర్తికాలం కొనసాగలేకపోయారన్నారు. సరిగ్గా వ్యవహరించే వారికి ఎక్కువ కాలం మనుగడ ఉండదనడానికి పీవీ ఉదాహరణ అన్నారు.
బలవంతుల ముందు పీవీ కూడా బాధితుడేనన్నారు. బాబ్రీ విధ్వంసాన్ని పీవీ కోరుకోలేదని, అది అనుకోకుండా జరిగిన సంఘటన అన్నారు. సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం రెండూ జరగాలని పీవీ కోరుకున్నారన్నారు. పీవీ తెచ్చిన సంస్కరణల క్రమాన్నే బీజేపీ కొనసాగిస్తోందన్నారు. భూసంస్కరణలు పూర్తిగా సమర్ధించదగ్గవి కానీ, ఆర్థిక సంస్కరణలు వివాదాస్పదమైనవని పేర్కొన్నారు. రైతు ఉద్యమంపై కాంగ్రెస్ స్పష్టమైన వైఖరితో ఉండాలని సూచించారు. సామాజిక సవి•కరణాల దృష్ట్యానే పీవీ సమైక్యవాదిగా ఉన్నారని తాను భావిస్తున్నట్టు తెలిపారు.
చనిపోయిన వారిని కూడా ఫిరాయింపు చేసే కొత్త ఉద్యమాన్ని టీఆర్‌ఎస్ మొదలు పెట్టిందని విమర్శించారు. పీవీని టీఆర్‌ఎస్ ఎలా ఓన్ చేసుకుంటుందని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ పార్టీది అవకాశ వాదమే అని కె.శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్ర మూర్తి, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, ఎమ్యెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, కమిటీ అధ్యక్షురాలు గీతారెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీధర్ బాబు, కన్వీనర్ మహేష్ గౌడ్, మర్రి శశిధర్ రెడ్డి, వంశీ చంద్ రెడ్డి, మల్లు రవి, కోదండ రెడ్డి, మాజీ మంత్రి వినోద్ తదితరులు పాల్గొన్నారు. పీవీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.