Take a fresh look at your lifestyle.

వివాదాల సుడిగుండంలో ‘‘డబ్ల్యుహెచ్‌ఓ’’

“ఎబోలా, సార్స్ ‌హెచ్‌ఐఎన్‌1 ‌వంటి వైరస్‌ల దాడి సమయంలోనూ విమర్శలు ఎదుర్కొన్నా డబ్ల్యూహెచ్‌ఓ ఇప్పుడు తన చరిత్రలో ఎరుగని స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటు న్నది. కరోనా వైరస్‌ ‌సృష్టిస్తున్న మారణహోమం నేపథ్యంలో ఆ సంస్థ కన్నా ముందుగానే  దాని ప్రమాదాన్ని పసిగట్టి  సమాచారాన్ని పంపినా, హెచ్చరించినా విస్మరించడమే గాక  ఉద్దేశపూర్వకంగా ఈ ప్రమాదకర పరిణామాలను దాచి పెట్టిందన్న  విమర్శలు ఎదుర్కొంటుంది. చైనా రాజకీయ ఒత్తిడి వల్లే డబ్ల్యూహెచ్‌ఓ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ అలా ఉపేక్షపూరిత వైఖరిని అనుసరించడన్నది ప్రధాన విమర్శ. వాస్తవాలు అతి భయంకరంగా ఉండగా దానిని తక్కువ చేసి చూపించారన్నది రెండవ ఆరోపణ.”

సమస్య ఉత్పన్నమైనప్పుడు అప్రమత్తం అయితే వచ్చే ఫలితం ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో, ఉదాసీనంగా ఉంటే ఎలాంటి ఫలితాన్ని చవిచూడాల్సి వస్తుందో దక్షిణ కొరియా, అమెరికాల వ్యవహార శైలి తేటతెల్లం చేస్తుంది. మొదటి నుంచి కరొనాపై తేలిక వైఖరిని అవలంబించిన డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌తాజా పరిణామాల నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ తీవ్ర అసహనంతో ఉన్న ట్రంప్‌ ‌తన అక్కసును ప్రపంచ ఆరోగ్య సంస్థ మీద వెళ్లగక్కుతూ, వైరస్‌ ‌వ్యాప్తి దాని తీవ్రత గురించి ప్రపంచాన్ని హెచ్చరించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర జాప్యం చేసిందని, ఈ వైరస్‌ ‌పుట్టుకకు కారణమైన చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రపంచ దేశాలను ప్రమాదంలోకి నెట్టిందని తీవ్ర విమర్శలు చేస్తూ, డబ్ల్యూహెచ్వోకు ఇచ్చే నిధులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా వైరస్‌ను వూహన్‌ ‌వైరస్‌గా, చైనా వైరస్‌గా పేర్కొంటూ ఉద్దేశపూర్వకంగా వైరస్‌ను వ్యాప్తి చేసినట్లు తేలితే డ్రాగన్‌పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు మాత్రమే డబ్ల్యూహెచ్‌ఓ ‌వైఖరిని గట్టిగా వ్యతిరేకిస్తూ నిధులు నిలిపి వేయగా తాజాగా తైవాన్‌ ‌కీలక ఆరోపణలు చేసింది. ఇప్పుడు వాటి సరసన ఆస్ట్రేలియా గట్టి మద్దతుదారుగా నిలిచింది. సాధారణంగా డబ్ల్యూహెచ్‌ఓకు పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తున్న దేశాల్లో 8వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా తటస్థ వైఖరిని అనుసరించి ఉంటుంది. కానీ కరోనా వైరస్‌ ‌సృష్టించిన మారణహోమం నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ ‌పనితీరుపై అంతర్జాతీయంగా స్వతంత్ర దర్యాప్తు చేయాలని ప్రకటించింది.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తలెత్తినా మశూచి, పోలియో, కలరా వంటి ప్రమాదకరమైన అంటువ్యాధులను అరికట్టి శాస్త్రీయమైన వైద్యాన్ని అందించే మార్గదర్శక సంస్థ అవసరమని భావించి 1948 ఏప్రిల్‌ 7‌న ఐక్యరాజ్యసమితి విభాగంగా ఏర్పడింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇది స్విజర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా పనిచేస్తూ 194 దేశాలు, సుమారు 438కు పైగా స్వచ్ఛంద సంస్థలు, సభ్యత్వం కలిగి ఏడు వేలమంది వైద్య, ఆర్థిక , సామాజిక నిపుణులు, విధాన రూపకర్తల సమ్మేళనంగా ఉంది. వివిధ దేశాల్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వాటి గురించి సభ్య దేశాలకు సమాచారం అందించి చికిత్సలు, ఔషధాలు, జాగ్రత్తలు, పరిశోధనలకు చొరవ తీసుకోవడం, బాధ్యతలు పంచుకోవడం దీని విధుల్లో ప్రధానమైనవి. ఆయా దేశాల అనుమతి లేకపోయినా నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లే అధికారం ఆ సంస్థకు ఉంది. ఇక్కడ వాస్తవ పరిస్థితిని, తీసుకుంటున్న చర్యలను నేరుగా తెలుసుకునే హక్కు కూడా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ బడ్జెట్‌ అం‌తా సభ్య దేశాల నుంచి వచ్చే ఫీజులు, విరాళాలతో నడుస్తుంది. ఆ సంస్థకు వచ్చే నిధులు 80 శాతం ఇలాంటి విరాళాలే. అందులో సింహభాగం సుమారు 18 శాతం నిధులను అమెరికా, 9.76 శాతం బిల్‌ అం‌డ్‌ ‌మిలిందా గేట్స్ ‌ఫౌండేషన్‌ ‌మరియు 8.39 శాతం జెనీవా కేంద్రంగా పనిచేసే జర్మనీకి చెందిన గాని అనే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య సంస్థ తరువాత వరుస క్రమంలో బ్రిటన్‌, ‌ఫ్రాన్స్, ‌కెనడా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్‌ ఉన్నాయి. చైనా ఇచ్చే నిధులు కేవలం 0. 21శాతం, ఆ దేశం కన్నా మెరుగ్గా భారత్‌ 0.48, ‌పాకిస్తాన్‌ 0. 36 ‌చొప్పున నిధులు ఇవ్వడం విశేషం.

ఎబోలా, సార్స్ ‌హెచ్‌ఐఎన్‌1 ‌వంటి వైరస్‌ల దాడి సమయంలోనూ విమర్శలు ఎదుర్కొన్నా డబ్ల్యూహెచ్‌ఓ ఇప్పుడు తన చరిత్రలో ఎరుగని స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నది. కరోనా వైరస్‌ ‌సృష్టిస్తున్న మారణహోమం నేపథ్యంలో ఆ సంస్థ కన్నా ముందుగానే దాని ప్రమాదాన్ని పసిగట్టి సమాచారాన్ని పంపినా, హెచ్చరించినా విస్మరించడమే గాక ఉద్దేశపూర్వకంగా ఈ ప్రమాదకర పరిణామాలను దాచి పెట్టిందన్న విమర్శలు ఎదుర్కొంటుంది. చైనా రాజకీయ ఒత్తిడి వల్లే డబ్ల్యూహెచ్‌ఓ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ అలా ఉపేక్షపూరిత వైఖరిని అనుసరించడన్నది ప్రధాన విమర్శ. వాస్తవాలు అతి భయంకరంగా ఉండగా దానిని తక్కువ చేసి చూపించారన్నది రెండవ ఆరోపణ. ఇథియోపియాకు చెందిన కమ్యూనిస్టు ప్రభావిత టెడోస్‌ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ ‌జనరల్‌గా నియామకంలో చైనా కీలకపాత్ర పోషించిందని అందువల్లే ఆయన చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అమెరికా అనుమానం ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆపత్కాల సమయంలో ఆలస్యంగాను, కొన్ని సందర్భాలలో అత్యుత్సాహంతోనూ స్పందించి విమర్శల పాలైంది. 2009లో మెక్సికో, అమెరికాలలో స్వైన్‌ ‌ఫ్లూ తలెత్తినప్పుడు డబ్ల్యూహెచ్‌ఓ అత్యుత్సాహంతో పని చేసిందని, ఆ దేశాల నుంచి పంది మాంసం వంటి ఎగుమతులు, పర్యాటకుల రాకపోకలను నిషేధించేలా చొరవ తీసుకున్నదన్న విమర్శలు, 2014లో పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్‌ ‌విస్తరించినప్పుడు తీరికగా 138 రోజుల తర్వాత స్పందించిందన్న విమర్శలు వచ్చాయి. జనవరి మొదట్లో వ్యాధి తీవ్రత జాడలు కనపడినప్పటికీ, మార్చి 11కి గాని దాన్ని మహమ్మారిగా ఎందుకు ప్రకటించిందన్న ఈ విషయంపై సంజాయిషీ ఇవ్వాల్సిందే. వాస్తవం ఏమైనప్పటికీ డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు నిలిపివేయడానికి ఇది సమయం కాదు. ఆ నిర్ణయం అత్యంత ప్రమాదకరమైనది. కరొనా మహమ్మారిపై ఐక్యమత్యంతో, దాత ృత్వంతో పోరాడాల్సిన సమయం అవసరం ఇప్పుడే అని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో తెలియజేస్తున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థకు సొంతంగా యంత్రాంగం ఉండదు. ఏ దేశంలోని పరిస్థితినైనా అక్కడి ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ఆధారంగా మాత్రమే ఉంటుంది. దానిని బట్టి అంతర్జాతీయంగా అప్రమత్తం చేస్తుంది. కావున ప్రస్తుత పరిస్థితిలో ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారిని ఎదుర్కొనడానికి సర్వశక్తులూ కేంద్రీకరించాల్సిన, ఈ సమయంలో డబ్ల్యూహెచ్‌ఓను బలిపశువును చేయడం తీవ్ర తప్పిదమే అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధులను అరికట్టడంలో డబ్ల్యూహెచ్‌ఓ ‌చెప్పుకోదగిన కీర్తిని గడిచింది. మశూచిని, పోలియోని అరికట్టడంలో గొప్ప కృషి చేసింది. అలాగే ఎబోలా వంటి అంటువ్యాధుల నిరోధంలోనూ సఫలమైంది. ఇటీవల దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలలో డెంగ్యూ విజృంభించకుండా చేసింది. అయితే అమెరికా, పాశ్చాత్య దేశాల రాజకీయ వ్యూహాల్లో చిక్కుకున్నదనే అభిప్రాయం ఉన్నది. జనవరి 8వ తేదీ నాడే అమెరికాలో కరొనా వైరస్‌ ‌గురించి ‘‘నేషనల్‌ ‌సెంటర్‌ ‌ఫర్‌ ‌మెడికల్‌ ఇం‌టెలిజెన్స్’’ ‌ట్రంప్‌ను హెచ్చరించింది. అదే నెల 21న అమెరికాలో తొలి కరొనా కేసు బయటపడిన తర్వాత కరొనా వ్యాధిని ఫ్లూ జ్వరంతో పోల్చి, లాక్‌ ‌డౌన్‌ ఆర్థిక వృద్ధికి నిరోధకంగా ఉంటుందని తెలిపినారు చివరకు తానే రెండుసార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించు కోవాల్సి వచ్చింది. తన నిర్లక్ష్యాన్ని బాధ్యతా రాహిత్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి డబ్ల్యూహెచ్‌ఓను బలిపశువు చేస్తున్నాడు. కరొనా వైరస్‌ ‌ప్రపంచాన్ని కకావికలం చేస్తున్న వేళ అందరి వేళ్లు వూహన్‌లోని పి4 ల్యాబ్‌ ‌వైపు చూపిస్తున్నాయి. వైరస్‌ ‌పుట్టుకకు ఈ ప్రయోగశాల వేదిక అనే వాదనలు జోరందుకున్నాయి.

ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తూ ప్రముఖ వైరాలజిస్ట్, ‌నోబెల్‌ ‌విజేత విచ్‌ ‌మౌంటెన్‌ ఇయర్‌, ‌సార్స్- ‌కోవ్‌-2 ‌జన్యు క్రమంలో హెచ్‌ఐవి, మలేరియా పరాన్నజీవికి సంబంధించిన జన్యువులు ఉండడం అనుమానాస్పదంగా ఉంది. ఈ వైరస్‌ ‌లక్షణాలు సహజ సిద్ధంగా లేవు అని వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నట్లుగా ఈ వైరస్‌ ‌వూహన్‌ ‌ప్రయోగశాల నుంచే లీక్‌ అయ్యిందా? ఇది నిజంగా జీవాయుధమా? వైరస్‌ ‌ప్రబలడంలో గబ్బిలాల పాత్ర ఎంత ? చైనా చెబుతున్నట్లు వూహన్లోని మాంసం విక్రయ మార్కెట్‌ ‌దీని వ్యాప్తికి ఎంత వరకు కారణం ? వైరస్‌ ‌వ్యాప్తి నిజంగా కుట్రేనా ? వంటి విషయాలపై ప్రపంచ దేశాలకు చైనా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రపంచం మొత్తం అభివృద్ధివైపు పరుగులు పెడుతున్న తరుణంలో కరొనా రూపంలో విశ్వాన్ని చుట్టుముట్టి, వేల మరణాలకు కారణమైన కొవిడ్‌19 ‌విపత్తు నిజంగా విలయమా? విపత్తా ? మానవ తప్పిదమా? ఉద్దేశపూర్వక ప్రయత్నమా? అన్న మీమాంసను పక్కనపెట్టి జన జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని మానవ మనుగడ కోసం అన్ని దేశాలు నడుం బిగించాల్సిన తరుణంలో, సిద్ధాంతాలు, విభేదాలతో కాలక్షేపం చేస్తే కరోనా కరాళ న ృత్యం ఖాయం అన్నది ఇప్పటికే ప్రపంచం నేర్చుకున్న పాఠం.

challa prabhakar reddy
డా. చల్లా ప్రభాకర్‌ ‌రెడ్డి
ప్రభుత్వ జూనియర్‌ ‌లెక్చరర్ల సంఘం

Leave a Reply