Take a fresh look at your lifestyle.

37 ‌వేలు దాటిన భూకంప మృతులు

  • మృతుల సంఖ్య లక్ష దాటే అవకాశం
  • టర్కీ, సిరియాకు పలు దేశాల ఆపన్నహస్తం
  • సహాయక బృందాలతో సాయం అందిస్తున్న దేశాలు

ఇస్తాన్‌బుల్‌, ‌ఫిబ్రవరి 14 : తుర్కియే, సిరియాలో గత సోమవారం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 37వేలకు చేరింది. ఇందులో టర్కీకి చెందిన వారు 31,643 మంది కాగా.. సిరియాకు చెందిన వారు 5,814 మంది అని అధికారులు తెలిపారు. శిథిలాలు మొత్తం తొలగిస్తే మృతుల సంఖ్య లక్ష దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా.. టర్కీ, సిరియాకు ఇతర దేశాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలతో సాయం అందిస్తున్నాయి. టర్కీకి ఇప్పటికే భారత్‌ ‌వైద్య, రెస్క్యూ బృందాలను పంపింది. మరోవైపు సిరియాకు రష్యా సాయం చేస్తోంది. ఆ దేశానికి చెందిన 300 మంది సైనికులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

మరోవైపు టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపం తరహాలోనే భారత్‌లోనూ భారీ భూకంపం సంభవించే అవకాశముందా..? భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం ఎప్పుడైనా సంభవించవచ్చా..! అంటే అవుననే అంటున్నారు డచ్‌ ‌పరిశోధకుడు ఫ్రాంక్‌ ‌హూగర్‌ ‌బీట్స్ . ‌టర్కీ, సిరియా భూకంపాన్ని ముందే పసిగట్టిన ఫ్రాంక్‌.. ‌భారత్‌లోనూ ఇదే తరహా భూకంపం వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. సిరియా, టర్కీల్లో భూకంపాలను అంచనా వేసిన ఫ్రాంక్‌ ‌న్యూస్‌ ‌ఛానెల్‌ ఇం‌డియా టుడే తో ప్రత్యేకంగా మాట్లాడారు. భారత్‌, అఫ్ఘానిస్తాన్‌, ‌పాకిస్తాన్‌ ‌ప్రాంతంలో కూడా భారీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్నారు ఫ్రాంక్‌. ‌టర్కీ, సిరియాలో 7.5 తీవ్రతతో భారీ భూకంపం వస్తుందని.. ఫ్రాంక్‌ ‌ఫిబ్రవరి 3న ట్వీట్‌ ‌చేశారు. అయన ట్వీట్‌ ‌చేసిన తర్వాత అతనిపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. కొంతమంతి ఎగతాళి చేశాడు.. అయితే ఫ్రాంక్‌ ‌ట్వీట్‌ ‌చేసిన మూడు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 6న నిజంగానే టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంభవించింది.

దీంతో ఫ్రాంక్‌ ‌పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. గ్రహాల కదలికలు, వాటి ప్రభావం ఆధారంగా అంచనా వేసినట్లు ఫ్రాంక్‌ ‌చెబుతున్నారు. ఇదే సమయంలో భారత్‌లో భూకంపం వచ్చే అవకాశముందా అని ఆయన్ను ఇండియా టూడే యాంకర్‌ ‌క్వశ్చన్‌ ‌చేశారు. అందుకు అయన ఇచ్చిన సమాధానం టెన్షన్‌ ‌పెడుతోంది. భూకంపం గుర్తింది కదా..? వేల మందిని పొట్టనబెట్టుకున్న ఆ భూప్రళయానికి చెందిన చేదు జ్ఞాపకాలు ఇంక కళ్ల ముందు కదలాడుతునే ఉన్నాయి. 2001 కచ్‌ ‌భూకంపం.. దేశంలో మూడవ అతిపెద్దది. ఈ విధ్వంసంలో 13,800 మందికి పైగా మరణించారు. లక్షా 67 వేలమందికిపైగా గాయలయ్యాయి. అలాంటి ముప్పు భారత్‌కు మళ్లీ పొంచి ఉండే అవకాశాలను కొట్టిపారేయలేమన్నారు ఫ్రాంక్‌. అయితే ఇది ఛాన్స్ ‌మాత్రమేనని.. ఇందులో ఎలాంటి కచ్చితత్వం లేదన్నారు. భారత ప్రభుత్వం తనను సంప్రదిస్తే.. తమ వద్ద ఉన్న వివరాలను పంచుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నానన్నారు ఫ్రాంక్‌. ఇక టర్కీ, సిరియా దేశాలను భారీ భూకంపాలు కుదిపేయడంతో భూకంపం అంటేనే ప్రజలు హడలిపోయే పరిస్థితి నెలకొంది. మరోవైపు టర్కీ, సిరియా భూకంపం మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 34వేల మందికిపైగా మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

Leave a Reply