Take a fresh look at your lifestyle.

మార్చి 18న ఎంసెట్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల

  • జూలై 5, 6 తేదీల్లో మెడికల్‌ ఎం‌సెట్‌
  • ‌జూలై 7, 8, 9 తేదీల్లో ఎంసెట్‌ ఇం‌జినీరింగ్‌
  • ఎంసెట్‌ ‌షెడ్యూల్‌ ‌ఖరారు

తెలంగాణ ఎంసెట్‌ ‌షెడ్యూల్‌ ‌ఖరారైంది. జూలై 5, 6 తేదీల్లో మెడికల్‌ ఎం‌సెట్‌ ‌పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే జూలై 7, 8, 9 తేదీల్లో ఎంసెట్‌ ఇం‌జినీరింగ్‌ ‌పరీక్షను నిర్వహించనున్నారు. మార్చి 18న నోటిఫికేషన్‌ ‌విడుదల కానుంది. ఈనెల 20 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరించనున్నారు. మొత్తానికి ఎంసెట్‌ ‌పరీక్ష కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌ ‌న్యూస్‌ ‌చెప్పింది. ఎంసెట్‌ ఎగ్జామ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం ఖరారు చేసింది. మార్చి 18న ఎంసెట్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

జూలై 5 నుంచి 9 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 20 నుంచి మే 18 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. 5, 6వ తేదీల్లో అగ్రికల్చర్‌, ‌ఫార్మా పరీక్షలు.. 7, 8 తేదీల్లో ఇంజినీరింగ్‌ ‌పరీక్షల నిర్వహణ 9వ తేదీన ఉంటుందని స్పష్టం చేసింది. ఎంసెట్‌లో ఇంటర్‌ ‌ఫస్ట్ ఇయర్‌ ‌నుంచి 100 శాతం, సెకండ్‌ ఇయర్‌ ‌నుంచి 70 శాతం సిలబస్‌ ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

ప్రతి రోజు రెండు దశల్లో ఆన్‌లైన్‌ ‌విధానంలో పరీక్ష జరుగుతుందన్నారు. ఈ పరీక్షలను తెలంగాణ స్టేట్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (••అఊఇ) ఆధ్వర్యంలో జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ టెక్నలాజికల్‌ ‌యూనివర్సిటీ ఆఫ్‌ ‌హైదరాబాద్‌ ‌నిర్వహించనుంది. ఫీజుకు సంబంధించిన వివరాలను టీఎస్‌ ఎం‌సెట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Leave a Reply