Take a fresh look at your lifestyle.

‌ప్రతీ గ్రామానికి గ్రామ ప్రణాళిక, బడ్జెట్‌ ఉం‌డాలి

Each village should have its own village plan and budget

  • గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం
  • కోసం కృషి చేయాలి
  • గ్రామాలకు ప్రభుత్వ లక్ష్యాలను వివరించిన మంత్రులు
  • రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్‌ ‌సమ్మేళనాలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల ప్రకారం బుధవారం రాష్ట్ర మంత్రులు, కలెక్టర్‌లు, ఇతర ఉన్నతాధికారులు పంచాయతీరాజ్‌ ‌సమ్మేళనాలను ప్రారంభించారు. జిల్లాల అధికారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వికారాబాద్‌లో రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతిరాథోడ్‌, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు జి.జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, ఈటెల రాజేందర్‌ ‌తదితరులందరూ ఈ సమ్మేళనాలలో పాల్గొని జిల్లాయంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. ప్రజాప్రతినిధులు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి మోడల్‌ ‌గ్రామాలుగా మోడల్‌ ‌పట్టణాలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ప్రవాసాంధ్రులతో మాట్లాడి తమ పుట్టిన గ్రామాలకు విరాళాలు ఇచ్చే విధంగా ప్రోత్సహించాలని ఎరబ్రెల్లి దయాకర్‌రావు సూచించారు. వికారాబాద్‌ ‌జిల్లాలోని పూడూర్‌ ‌మండలం మన్నెగూడ జేకే ఫంక్షన్లో పల్లె ప్రగతి పట్టణ ప్రగతిపై పంచాయతీరాజ్‌ ‌సమ్మేళనంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి దిశలో పయనించాలని పట్టణ పల్లె ప్రగతి కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందులో అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. నిధులను సమకూర్చుకుని గ్రామాలను పట్టణాలను ప్రజాప్రతినిధులు తీర్చిదిద్దాలని నిధులను సమకూర్చుకుని గ్రామాలను పట్టణాలను ప్రజాప్రతినిధులు తీర్చిదిద్దాలని సూచించారు. ప్రత్యేకంగా గ్రామాలలో స్వయంగా నిధులను సమకూర్చుకునే విధంగా బడ్జెట్‌ ‌రూపొందించుకోవాలని తెలిపారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. ప్రతీగ్రామంలో గ్రామసభలు చేపట్టాలని,గ్రామసభల్లోతీర్మానంచేసుకున్నప్రకారం నిర్ద్టి సమయాన్ని నిర్ణయించుకొని పనులు పూర్తిచేయాలని ఆమె చెప్పారు.

- Advertisement -

గ్రామాలకు ఏ సహాయం కావాలన్నా తాను అందుబాటులో ఉంటానని విద్యాశాఖమంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌రాష్ట్రంలో కరెంటు కష్టాలు తీర్చారని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతాంగానికి విద్యుత్‌ ‌కష్టాలు తీర్చారని తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో శాశ్వతంగా నీటి కరువును తీర్చేందుకు మిషన్‌ ‌భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన జలాలనందించి ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌ప్రజల గుండెల్లో అపర భగీరథునిగా నిలిచారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధిలో తీర్చిదిద్దుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న క్లీన్‌ అం‌డ్‌ ‌గ్రీన్‌ ‌కార్యక్రమాలను సరైన విధంగా అమలు చేసి గ్రామాలను పట్టణాలను అభివృద్ధిలో తీర్చిదిద్దాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ‌పౌసమిబసు వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ ‌జిల్లా పరిషత్‌ ‌చైర్పర్సన్‌ ‌సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, మండల అధ్యక్షులు, ఎంపిటిసిలు సర్పంచులు, కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.

మహబూబాబాద్‌ ‌జిల్లా కేంద్రంలో జరిగిన పంచాయతీరాజ్‌ ‌సమ్మేళనంలో రాష్ట్ర మంత్రి సత్యవతిరాథోడ్‌ ‌పాల్గొన్నారు. ఎంపీ మాలోతు కవిత, శాసనసభ్యులు రెడ్యానాయక్‌, ‌శంకర్‌నాయక్‌, ‌జడ్పీచైర్‌పర్సన్‌ ‌కుమారి బిందు, కలెక్టర్‌ ‌గౌతమ్‌ అదనపు కలెక్టర్‌ ‌వెంకటేశ్వర్లు తదితరలు పాల్గొన్నారు. గాంధీజీ కలలుకన్న గ్రామస్వరాజ్యం సాధించేవిధంగా పల్లెలను ప్రణాళికల ప్రకారం అభివృద్ధి చేయాలని సూచించారు. గ్రామాల్లో విద్యుత్తుకష్టాలు తీరాయని, వ్యవసాయరంగ సమస్యలు చాలావరకు పరిష్కారమయ్యాయని, అన్ని గ్రామాలకు మంచినీటి సదుపాయం వచ్చిందని చెప్పారు. ప్రతీ గ్రామంలో చెట్లు పెంచినప్పుడే ప్రగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆదర్శగ్రామాలను రూపొందించాలని ఆమె చెప్పారు. వివిధ దేశాలలో స్థిరపడిన ప్రవాసభారతీయులతో మాట్లాడి తమ పుట్టిన ఊరుకు మేలు చేసేవిధంగా ఆలోచింప చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు.

Leave a Reply