Take a fresh look at your lifestyle.

‌ప్రతి క్వింటాల్‌కు ఐదొందల బోనస్‌ ‌ప్రకటించాలి

‌కరోనా పరిస్థితుల దృష్ట ప్రతి క్వింటాల్‌కు 500బోనస్‌ ‌ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్సీ ఎన్‌.‌రామచందర్‌ ‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. కిసాన్‌ ‌మోర్చా ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల ను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో హమాలీల సంఖ్య పెంచి, గన్ని బ్యాగుల కొరత నివారించాలని అన్నారు. ఐకెపి కేంద్రాల్లో ధాన్యం నిల్వ లేకుండా త్వరత్వరగా కొనుగోలు చేయాలని అన్నారు.

రైతాంగానికి సంబంధించిన వాహనాలను ఎట్టి పరిస్థితులలోనూ ఆపకుండా వారికి సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్‌ ‌మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసూదన్‌ ‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దాసరి మల్లేశం, కార్యవర్గ సభ్యులు పోతంశెట్టి రవీందర్‌, ‌జిల్లా ఉపాధ్యక్షులు నకిరేకంటి మొగులయ్య, జిల్లా కార్యదర్శి కన్నెకంటి వెంకటేశ్వర చారి, మండల పార్టీ అధ్యక్షులు తాటిపాముల శివ కృష్ణ, నాయకులు వనం అంజయ్య, సురేష్‌, ‌డోగిపర్తి సుభాష్‌, ‌దావునూరి వెంకటేశం, సిందం లింగయ్య, శారగొండ మల్లికార్జున్‌, ‌నకిరేకంటి సుదర్శన్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply