
ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాదితులకు రక్తం అందించేందుకు, రక్త దాతల రక్త నిల్వలను సేకరించేందుకు బ్లడ్ ట్రాన్స్‌పోర్టేషన్ వాహనం వినియోగపడుతుందని అపాయకర పరిస్థితుల్లో ఈ వాహనాన్ని సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా ప్రదాన అసుపత్రికి కొత్తగా కేటాయించిన బ్లడ్ ట్రాన్స్‌పోర్టేషన్ వాహ నాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంబించారు. అనంతరం అయన మాట్లాడుతూ ఈవాహనంతో ఎంతో ప్రయోజనం ఉంటుందని రోడ్డు ప్రమాద భాదితులకు అక్కడికే ఈ వాహనం వెళ్లి రక్తం అందించే సేవలున్నాయన్నారు. ఆలాగే రక్త దాతల రక్తాన్ని సేకరించడానికి క్యాంపులకు రాకుండా నేరుగా వారి వద్దకే వెళ్లి రక్త సేకరణ చేయవచ్చ న్నారు. ఆనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత మాట్లాడుతూ ఈ వాహనంతో అపదలో ఉన్న ప్రతి వారికి తక్షణమే రక్తాన్ని అందించి ప్రాణాన్ని రక్షించవచ్చన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రతి ఓక్కరికి ఈవాహన సేవలు ఎంతో ఉపయోగపడతాయని ఈ వాహనాన్ని జగిత్యాలకు కేటాయించడం శుభపరిణామమన్నారు. అసుపత్రి పరిసరాలు ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలన్న )క్ష్యంతో సిఎం కేసిఆర్ జన్మదినోత్సవాన ఇక్కడ మొక్కలను నాటడం జరిగిందన్నారు.
అనంతరం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ జగిత్యాలలో 60 సంవత్సరాల క్రితం ఏర్పాటైన ఈఆసుపత్రి నేడు తెరాస ప్రభుత్వ సహకారంతో వంద పడకల అసుపత్రిగా అభివృద్ది చెందిందన్నారు. బ్లడ్ ట్రాన్స్‌పోర్టేషన్ వాహనాన్ని జగిత్యాలకు కేటాయించడం సంతోషకరమన్నాఉ. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారికి రక్తం సరఫరా చేసి వారి ప్రాణాలను కాపాడి కుటుంబాలను అదుకునే సదుపాయం ఉంటుందన్నారు. ఈకార్యక్రమములో మున్సిప ల్ చైర్మన్ డాక్టర్ బోగశ్రావణి, ఆర్ఎంవో రామకృష్ణ,అసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సుధక్షినాదేవి, డిఎంఆండ్ హెచ్‌వో శ్రీధర్, ఉప వైద్యాదికారి జైపాల్, కలెక్టరేటు ఎవో, తదితరులున్నారు.