Take a fresh look at your lifestyle.

వొచ్చే వారం నుంచి ఈ’ ఆఫీస్‌

  • ‌కొరోనా విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం
  • ప్రతీ శాఖకు ప్రత్యేక నోడల్‌ అధికారి

‌రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలలో వచ్చే వారం నుంచి ఈ ఆఫీస్‌ ‌పద్దతిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు కొరోనా బారిన పడటం, గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో వైరస్‌ ‌తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ ‌సెంటర్‌ ఈ ఆఫీస్‌ ‌విధానాన్ని రూపొందించింది. దీని ద్వారా ఉద్యోగులు కంప్యూటర్‌ ‌ద్వారానే ఫైళ్లను పరిష్కరించే వీలు కలుగుతుంది. ఇందుకు గాను ప్రతీ శాఖకు ప్రత్యేకంగా ఓ నోడల్‌ అధికారితో పాటు ఆయనకు మరో అధికారిని సహాయకునిగా నియమిస్తారు.

ఈ ఆఫీస్‌ ‌నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులందరికీ త్వరలోనే శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు భౌతికంగా విధులు నిర్వర్తించకుండానే కార్యకలాపాలు కొనసాగించడంతో పాటు ఫైళ్ల పరిష్కారంలోనూ ఎలాంటి గందరగోళం లేకుండా ఈ పద్దతి ద్వారా సాధ్యమవుతుందని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. ముందుగా, ఎక్కువ ఫైళ్లు ఉండే ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్‌, ఎం‌డోమెంట్‌ ‌శాఖలలో ఈ ఆఫీస్‌ ‌విధానాన్ని అమలు చేసి ఆతరువాత ఒక్కొక్కటిగా అన్ని శాఖలలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 

Leave a Reply

error: Content is protected !!