Take a fresh look at your lifestyle.

ధరల సెగలో దసరా

ధరల పెరుగుదల మెరుపులతో
పేదవాడికి పండుగ
గుండెల్లో పెరిగిన ధరల పిడుగుల ఉప్పెనలో
ఏంచేయలో తెలియని చితికిపోయిన గతుకుల బతుకుల చిత్రం
ఏది కొనాలన్నా అందనిద్రాక్షలా నిట్టూర్పులు
పండగంటే పల్లెబతుకుల్లో వెల్లివిరిసే ఆనందమే కదా
నేడది మాయమైంది

బతుకమ్మలాటలో బారులుతీరి బాండుబజాయించినా
బ్రాండాంబసీడర్‌ ‌కే గదా
ఆకలితీరేది
బతుకమ్మ చీరలతో పర్వం జరిగే హేయస్థితి
ఉచితానుచితాలతో పిచ్చోళ్ళనుజేసి
ప్రజలందరినీ గారడీజేసే జుదగాలేలుతున్న
మాటలరాజ్యంలో ప్రజల దౌర్భాగ్యం పోయేదెపుడు

ఏదేమైన తిరోగమనమే
లేనోడిబతుకు ముఖచిత్రం
స్వతంత్ర దేశంలో
బానిస సంకెళ్లు వీడనేలేదు
బిస్కెట్లు విసిరి అధికారందలాలెక్కే నాయకత్వం
కార్పోరేట్‌ ‌రాజకీయ చదరంగంలో దోపిడిమంత్రమేకదా అజెండా
చట్టమెపుడు వారికనుకూలమే
ఎవరైతేనేం వేళంలో కొనడమే వారికలవాటు
మార్పెంతజరిగినా అదెపుడు వారిపాదాలచెంతే
ఆకాశాన్ని సైతం ఆక్రమించే నేర్పున్న మహానుభావులు
పేదవాడి పేగులకెపుడు
ఎంగిలి విసిరేసి దాసోహంజేసుకునే ధనదాహార్తులు వారు
మార్పు వస్తుంటే దానికి మసిబూసి మబ్బుల్లోకి నెట్టడం మబాగా తెలిసినోళ్ళ పాలన పడగలో
పండగెలా పబ్బమెలా..??

– సి. శేఖర్‌(‌సియస్సార్‌),
‌పాలమూరు, 9010480557.

Leave a Reply