Take a fresh look at your lifestyle.

వర్షాకాలంలో రైతులు జాగ్రతగా ఉండాలి

‌మహబూబ్‌నగర్‌, ‌మే 1 (ప్రజాతంత్ర ప్రతినిధి) : రాబోయే వర్షాకాలంలో రైతులు పూర్తిగా జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద ఉండకుండా, ఉరుములు, మేఘాల పట్ల అప్రమత్హంగా ఉండాలని మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ అన్నారు. గత నెల 28వ తేదీన పిడుగుపాటుకు చనిపోయిన మహబూబ్నగర్‌ ‌మండలం మాచన్‌ ‌పల్లి తండాకు చెందిన ఇస్లావత్‌ ‌భీములా నాయక్‌,ఇస్లావత్‌ ‌సరోజ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్‌, ‌క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్‌ ‌వి. శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌శుక్రవారం అం తెలిపారు. పిడుగుపాటుకు కుటుంబ పెద్దలు ఇద్దరు చనిపోవడం దురదృష్టకరమని అన్నారు .

పిడుగుపాటుకు చనిపోయిన ఇస్లావత్‌ ‌భీములా నాయక్‌ అతని భార్య సరోజ అంత్యక్రియలకు అయిన ఖర్చుకు సంబంధించి ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున 40 వేల రూపాయల చెక్కును మంత్రి శుక్రవారం మహబూబ్‌నగర్‌ ‌మండలం కోడూరు వద్ద ఇస్లావత్‌ ‌భీములా నాయక్‌ ‌తల్లి ముత్యాలమ్మకు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిడుగుపాటుకు రైతు కుటుంబం మృతి చెందడం బాధాకరమని, అయితే వారి పిల్లలను ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని, ఆ కుటుంబానికి రైతు బీమా తో కలుపుకొని మొత్తం 17 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని త్వరలోనే అందిస్తామని మంత్రి వెల్లడించారు. . ఇస్లావత్‌ ‌భీములా నాయక్‌ ఇద్దరు పిల్లలను మంచి రెసిడెన్షియల్‌ ‌పాఠశాలలో చేర్పిస్తామని మంత్రి తెలిపారు.బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను కూడా అందజేశారు కరోనా పట్ల ప్రజలు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పటికప్పుడు జారీ చేసే మార్గానిర్దేశకాలను పాటిస్తూ జిల్లాలో జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల వల్ల మరణాలు సంభవించలేదన్నారు.కరోనా ఉన్నప్పటికీ జిల్లాలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని,ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని, భవిష్యత్‌ ‌తెలంగాణ బాగుంటుందని మంత్రి అన్నారు.

మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా నుండి కేరళ తమిళనాడు లకు వరి పంపటం జరిగిందని,అలాగే జిల్లాలో పండిన మామిడి సైతం యు. కె తదితర యూరప్‌ ‌దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతున్నదని మంత్రి తెలి పారు. కరోనాను దూరం చేసి ప్రాణాలు కాపాడుకొందామని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్గౌడ్‌, ‌పిఎసిఎస్‌ అధ్యక్షుడు రాజేశ్వర్‌ ‌రెడ్డి ,రైతు సంఘం అధ్యక్షులు నరసింహారెడ్డి , జెడ్పిటిసి అల్లావుద్దీన్‌ ,‌మార్కెట్‌ ‌కమిటీ అధ్యక్షుడు ఆంజనేయులు, స్సర్పంచ్‌ ‌మల్లికార్జున్‌ ‌రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు తాసిల్దార్‌ ‌కిషన్‌ ‌వ్యవసాయ శాఖ ఏడి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy