Take a fresh look at your lifestyle.

కొరోనా కాలంలో .. జర్మనీ లో ‘సాకర్ ‘ లీగ్ షురూ ..!

“సాకర్ యూరప్‌కు తిరిగి వస్తోంది” అని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మే 6 న ప్రకటించారు. జర్మనీ దేశం లో రెండు ప్రధాన స్టేడియమ్స్ లో వారానికి రెండు సార్లు ఆటగాళ్లను పరీక్షించడం వంటి కఠినమైన నియమాలు అమలు చేస్తూ ఈ నెలలో ఆటను తిరిగి ప్రారంభిస్తున్నాం.. అని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ప్రపంచాన్ని ఉర్రుతలూగించే సాకర్ ఆటకి సంబంధించిన ప్రకటన చేసారు. కట్ చేస్తే జర్మన్ ఫుట్‌బాల్ లీగ్ (డిఎఫ్‌ఎల్) మే 16 న బుండెస్లిగా సాకర్ సీజన్ కి తెరలేపి ప్రపంచ ప్రఖ్యాత ఆట మొదలు పెట్టింది.కొరోనావైరస్ మహమ్మారి కాలంలో తిరిగి ప్రారంభమైన మొదటి అతిపెద్ద యూరోపియన్ ఫుట్ బల్ లీగ్‌ ఆట మొదలు అయ్యింది.. బుండెస్లిగా జర్మనీలో ఒక ప్రొఫెషనల్ ఫుట్ బల్ అసోసియేషన్. ఈ అసోసియేషన్ ఆడించే ఫుట్‌బాల్ లీగ్ ను ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రజలు స్టేడియంలో హాజరు అయి చూస్తారు అన్న రికార్డు బుండెస్లిగా ఫుట్ బల్ అసోసియేషన్ సొంతం. ప్రస్తుతం జరుగుతున్న బుండెస్లిగా సీజన్ లో కేవలం 300 మంది మాత్రమే స్టేడియంలో హాజరు అవుతుండగా.. సాకర్ యూరప్‌కు తిరిగి వచ్చింది.. కోవిద్-19 కారణంగా మార్చి మధ్యలో యూరోపియన్ ఖండం అంతటా క్రీడలు మూసివేయబడిన తరువాత తిరిగి వచ్చిన ప్రధాన యూరోపియన్ క్రీడలలో సాకర్ మొదటిది. ఇంగ్లాండ్, స్పెయిన్, ఇటలీ, అలాగే యునైటెడ్ స్టేట్స్ లోని స్పోర్ట్స్ అధికారులు.. స్పోర్ట్స్ బ్రాండ్స్.. ఇతర లీగ్‌లు క్రీడలు ఎలా తిరిగి మొదలుపెట్టాలి అనే రోడ్ మ్యాప్‌ కోసం ఆశతో ఎదురు చూస్తున్న సమయంలో జరిగిన పరిణామం ఇది. దేశాల మధ్య స్నేహాల పెంపు కోసం మొదలు అయిన ఆటలు కొరోనా వైరస్ సమయంలో జరగకపోతే ప్రజలకి ఏం నష్టం జరుగుతుంది..? ప్రజలకి సాకర్ జరగకపోతే ఏమి నష్టం జరగనప్పుడు.. ఎందుకు ఇన్ని దేశాల స్పోర్ట్స్ క్లబ్స్ కొరోనా అయినా సరే ఆటలు మొదలు పెట్టాలి అని ప్రబుత్వాల మీద ఎందుకు ఒత్తిడి చేస్తున్నాయి..? బుండెస్లిగా సీజన్ అంటేనే అర్ధం అత్యధిక ప్రజలు ఓ స్టేడియంలో చేరి కేరింతలు కొడుతూ ఉంటే వానొచ్చినా.. వరదొచ్చినా.. ఆటగాడు పరిగెత్తి గోల్ కొడుతుంటే.. కేరింతల హేల అంబరాన్ని తాకాలి..

ఇది కదా బుండెస్లిగా సీజన్ ఆట మజా.. ఇంత స్వచ్చమైన ఆనందం రికార్డు సొంతం అయిన బుండెస్లిగా ఫుట్ బల్ అసోసియేషన్ అలా ఎలా తనకి మాత్రం సొంతం అయిన రికార్డును వదిలేసుకొని కేవలం మూడు వందల మంది సమక్షంలో సాకర్ ఆట జరిపించటానికి సిద్ద పడింది..? సమాధానం టీవిలో దొరుకుతుంది.. కమర్షిల్ యాడ్స్ లో దొరుకుతుంది.. గత ఏడాది జరిగిన సాకర్ వలన ప్రపంచంలో వున్నా టాప్ మోస్ట్ 20 ఫుట్ బాల్ క్లబ్స్ ఆదాయం 10.6 బిలియన్ డాలర్లు. దీనిలో 44% ఆదాయం సాకర్ మ్యాచుల రైట్స్ టీవీకి అమ్మటం ద్వారా అంటే బ్రాడ్కాస్ట్ రైట్స్ ద్వారా వచ్చింది.. సుమారు 4.7 బిలియన్స్ ఆదాయం టీవీ ఇచ్చింది.. ఇక యాడ్స్ ద్వారా ఈ క్లబ్స్ సంపాధించింది మరో 40% అంటే 4.2 బిలియన్ డాలర్లు.. టీవీ ఇచ్చిన ఆదాయం యాడ్స్ ఇచ్చిన ఆదాయం కలిపితే టాప్ 20 ఫుట్బాల్ క్లబ్స్ కు అందినది అక్షరాలా 9.6 బిలియన్ డాలర్లు.. ఇక మ్యాచ్ డే రోజు టికెట్ అమ్మితే వచ్చే ఆదాయం కేవలం 1.5 బిలియన్ డాలర్లు మాత్రమే.. సో మ్యాచ్ డే ఆదాయం సాకర్ ఆట దిష్టి తీసే అంత కూడా కాదులే అనుకుని బుండెస్లిగా ఫుట్ బల్ అసోసియేషన్..కొరోనా కాలంలో తన ఖజానా నింపుకోటాని యూరప్‌కు సాకర్ ను తిరిగి తెచ్చింది.. ఈ ప్రస్తుత ఖజానా నింపుకునే డబ్బు ఆటలో కార్మికులెవరో తెలుసా..మనం ఆరాధించే ఆటగాళ్లు.. డార్ట్మండ్ రైసింగ్ స్టార్ జియో రేనాతో సహా జర్మనీలో 30 మందికి పైగా అమెరికా ఆటగాళ్లు ఆడుతున్నారు (స్వదేశం కొరోనాతో కల్లోలం అయితున్నా ఈ ఆటగాళ్లు ఆడాల్సిందే). టైలర్ ఆడమ్స్,జోష్ సార్జెంట్, యు.ఎస్.గోల్ కీపర్ జాక్ స్టెఫెన్ కూడా ఆడే వారి జాబితాలో ఒకరుగా వున్నారు..అయితే జాక్ స్టెఫెన్ కి గత వారం ఫార్చునా డ్యూసెల్డార్ఫ్‌లో శిక్షణ సమయంలో మోకాలికి గాయమైంది. ఇతను కనీసం ఒక నెల ఆడలేకపోవచ్చు భావిస్తున్నారు.

Leave a Reply