Take a fresh look at your lifestyle.

దురంతో, రాజధాని, శతాబ్ది, వందేభారత్‌ ‌రద్దు

దేశంలో కొరోనా విలయ తాండవం చేస్తున్నది. వైరస్‌ ‌కట్టడికి పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ‌విధించగా.. మరికొన్ని చోట్ల నైట్‌ ‌కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ‌తరహా ఆంక్షలు అమలువుతున్నాయి. అలాగే ప్రయాణికులకు ఆర్‌టీపీసీఆర్‌ ‌నెగెటివ్‌ ‌పరీక్ష సర్టిఫికెట్‌ ‌చూపాలని చెబుతున్నాయి. దీంతో ఈ ప్రభావం రైల్వేలపై తీవ్రంగా పడుతోంది. ఫలితంగా ఆక్యుపెన్సీ లేకపోవడంతో ఇప్పటికే పెద్ద ఎత్తున సర్వీసులను రైల్వేశాఖ రద్దు చేసింది. తాజాగా దురంతో, రాజధాని, శతాబ్ది, వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌సహా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

సంబంధిత రైళ్లు ఈ నెల 9 నుంచి అందుబాటులో ఉండవని.. ప్రస్తుతం దేశంలో కొరోనా కేసులు పెరుగుతూనే ఉన్నందున తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు రైళ్లు నడవవని నార్త్ ‌రైల్వేశాఖ తెలిపింది. విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సూచించింది.

Leave a Reply