ఇక్కడ మనం చూస్తున్నది అచ్చు గుద్దినట్లు డంప్ యార్డులా కనిపిస్తుంది కదూ.. కానీ ఇది డంపింగ్ యార్డ్ అనుకుంటే త(ప)ప్పులో కాలేసినట్లే.. బోడుప్పల్, పీర్జాదిగూడ జంట నగర పాలక సంస్థల శివారు అయిన మేడిపల్లి-చెంగిచర్ల ప్రాంతంలోని ప్రధాన రహదారి పక్కన చెత్తాచెదారాలను అక్రమంగా డంప్ చేస్తున్న దృశ్యమిది..చెత్త కుప్పలు, మట్టి దిబ్బలు, వ్యర్థాలు, మురికి నీటి కంపుతో పరిసరాలు దుర్గందభరితమవుతున్నాయి..
రోడ్డుకిరువైపుల పచ్చని చెట్లతో నందనవనంలా ఉండాల్సిన రహదారి చెత్తాచెదారాలతో చీకాకు కలిగిస్తూ దుర్గందం వెదజల్లుతోంది..ప్రగతిలో తామే మేటి అంటూ, కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామంటూ గొప్పలుపోతున్న ఇరు బల్దియాల పాలకులకు ఈ సమస్య సవాల్ విసురుతోంది..స్వచ్ఛ భారత్ లక్ష్యాన్ని నీరు గారుస్తోంది.