Take a fresh look at your lifestyle.

డిసిఎంను ఢీకొట్టిన డంపర్‌ – ‌డ్రైవర్‌ ‌మృతి

Dumper, DCM Accident, killed Driver, dot company, driver durgam Krishnaiah
మృతుడి కుటుంబానికి డాట్‌ ‌కంపెనీ 23 లక్షలు నష్టపరిహారం హామి

మందమర్రి సింగరేణి ఏరియాలోని రామకృష్ణాపూర్‌ ఓసిలో శుక్రవారం తెల్లవారుజామున డాట్‌ ‌కంపెనీకి చెందిన డంపర్‌ అదే కంపెనికి చెందిన డిసిఎం వ్యాన్‌ ‌ను ఢీకొట్టడంతో ఘెర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డిసిఎం వ్యాన్‌ ‌నడుపుతున్న డ్రైవర్‌ ‌దుర్గం కృష్ణస్వామి(45) అక్కడికక్కడే మృతి చెందినట్లు రామకృష్ణాపూర్‌ ఎస్సై రవిప్రసాద్‌ ‌తెలిపారు.

వివరాల్లోకి వెళితే మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్‌ ఓసిఓసిగని డాట్‌ ‌కంపెనీ కాంట్రాక్ట్ ‌డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో శుక్రవారం తెల్లవారుజామున డాట్‌ ‌కంపెనీకి చెందిన డంపర్‌ ‌డ్రైవర్‌ అల్లం శ్రీనివాస్‌కు ముందు ఉన్న ఐచర్‌ ‌వ్యాన్‌ ‌కనపడకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ఎస్సై తెలిపారు.మృతదేహాన్ని రామకృష్ణాపూర్‌ ఏరియాసుపత్రికి తరలించి అక్కడ నుండి పోస్టుమార్టర్‌ ‌నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వఆసుపత్రికితరలించినట్ల తెలిపారు.ఈ మేరకు మృతుడిమామ ఫిర్యాదు మేరకు డంపర్‌ ఆపరేటర్‌ ‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags: Dumper, DCM Accident, killed Driver, dot company, driver durgam krishnaiah

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply