Take a fresh look at your lifestyle.

దుబ్బాక, గ్రేటర్‌ ఎన్నికల్లో గెలిచి సత్తాచాటాలి

పార్టీ నాయకులకు, క్యాడర్‌కు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విజ్ఞప్తి
పాలకులు దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శ

‌ప్రతి ఒక్క నాయకుడు పని చేసి దుబ్బాకలో గెలిచి చరిత్ర సృష్టించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. ఇక్కడ పాలకులు విపరీతమైన దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. సోమవారం చార్మినార్‌ ‌వద్ద రాజీవ్‌ ‌గాంధీ 30 వ సద్భావన యాత్ర కార్యక్రమం జరిగింది. ప్రధాన మంత్రి సలహాదారుడిగా పని చేసిన ‘‘పద్మభూషణ్‌’’ ‌శ్యామ్‌ ‌పిట్రోడా ఈ సంవత్సరం అవార్డు అందచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ‌పార్టీ జెండా ఎగురవేశారు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి. ఈ  సందర్భంగా ఉత్తమ్‌ ‌మాట్లాడుతూ …దుబ్బాక, జిహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో  గెలిచి సత్తా చాటాలన్నారు. కాంగ్రెస్‌ ‌మూల సిద్ధాంతం మత సామరస్యం, సామాజిక న్యాయమని ఐక్యత, క్రమశిక్షణతో పని చేయాలన్నారు. ఏఐసీసీ ఇంచార్జి మణికం టాగూర్‌ ‌మాట్లాడుతూ ….రాజీవ్‌ ‌గాంధీ సద్భావన కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమిటీని మనస్పూర్తిగా అభినందించారు. హైద్రాబాద్‌లో ఇటీవల వరదలు వొచ్చి వేలాది మంది వరదల్లో చిక్కుకొని బాధలు పడుతున్నారని, వరదలల్లో చనిపోయిన వారికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. బాధల్లో ఉన్న వారికి కాంగ్రెస్‌ ‌పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ప్రధానమంత్రిగా రాజీవ్‌ ‌గాంధీ ఉన్నప్పుడు రాబోయే జనరేషన్‌ ‌గురించి ఆలోచించారని, ఇప్పుడున్న ప్రధాన మంత్రులు రాబోయే ఎన్నికల గురించి, ఈవిఎంల గురించి ఆలోచిస్తారని విమర్శించారు. దేశంలో సాంకేతిక విప్లవం గురించి మాట్లాడాల్సి వస్తే రాజీవ్‌ ‌గాంధీ, శ్యామ్‌ ‌పిట్రోడా గురించి మాట్లాడకుండా ఉండలేమని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో మతాల మధ్య చిచ్చులు రాకుండా ఆపాల్సిన పాలకులు ఇప్పుడు మతాలకు, కులాలకు చిచ్చుపెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూడడం సిగ్గుచేటన్నారు. కులాల మధ్య, మతాల మధ్య, మనుషుల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందుతున్న పార్టీలకు బుద్ది చెప్పలన్నారు. ఈ కార్యక్రమంలో  ఇంకా ఏఐసీసి కార్యదర్శి బోసురాజ్‌, ‌మాజీ ఎంపి విహెచ్‌, ‌మధుయాస్కి గౌడ్‌, ‌మాజీ మంత్రి షబ్బీర్‌ అలి, గీతారెడ్డి, అంజన్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ‌తదితర నాయకులు పాల్గొన్నారు .

 

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply