నాగర్ కర్నూల్: ఇటీవల వారం రోజుల నుండి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి,వరి పంటలు నీటమునిగి నష్టం వాటిల్లింది. వ్యవసాయ అధికారులు గ్రామాలు తిరుగుతూ నష్టం జరిగిన పంటలు పరిశీలిస్తున్నారు. శనివారం కురిసిన వర్షానికి గ్రామాల్లో ఉన్న చెరువులు కుంటలు నిండిపోవడంతో అలుగులు పారుతున్నాయి. ఎక్కడ చూసినా నీళ్లతో ఉప్పొంగి పోతున్నాయి.కొన్ని గ్రామాల్లో కుంటలు తెగి పత్తి,వరి పంట నీటమునిగాయి భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రైతులు వరి పంట వేయడంతో అట్టి పంట మొత్తం నీట మునిగి నష్టం వాటిల్లింది.లింగాల మండలంలోని లింగాల, కోమటికుంట,దత్తారం, జీలుగు పల్లి,అంబటిపల్లి, తెల్కపల్లి మండలంలో బొపల్లి,పెద్దూర్,వట్టిపల్లి,