Take a fresh look at your lifestyle.

డబ్బింగ్‌ ఆర్టిస్ట్ శ్రీ‌నివాస మూర్తి కన్నుమూత

హైదరాబాద్‌, ‌జనవరి 27 : ప్రముఖ డబ్బింగ్‌ ఆర్టిస్ట్ శ్రీ‌నివాస మూర్తి కన్నుమూశారు. చెన్నైలో ఇవాళ ఆయన గుండెపోటుతో మరణించారు. శ్రీనివాస మూర్తి తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. డబ్బింగ్‌ ‌రంగంలో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ఆయన తెలుగులో సూర్య, అజిత్‌, ‌మోహన్‌ ‌లాల్‌, ‌రాజశేఖర్‌, ‌విక్రమ్‌ ఇలా ఎంతో మంది స్టార్‌ ‌హీరోల పాత్రలకు తెలుగులో డబ్బింగ్‌ ‌చెప్పారు. ఈయన ఎన్నో సినిమాల్లో చేసినప్పటికీ పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. ఒ డియా ఛానెల్‌ ‌చేసిన ఎక్స్ ‌క్లూజివ్‌ ఇం‌టర్వ్యూతో శ్రీనివాస మూర్తి గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ తారలు సంతాపం వ్యక్తం చేశారు

Leave a Reply