Take a fresh look at your lifestyle.

భారీ బందోబస్తు మధ్య.. నేడు దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌

  1. ‌పోలింగ్‌ ‌ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలు
    ఉప ఎన్నిక బరిలో 23 మంది అభ్యర్థులు
    కొరోనా నేపథ్యంలో ప్రత్యేకచర్యలు తీసుకున్న అధికారులు

సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక రంగం సిద్ధం అయ్యింది. ప్రచారహోరు ముగిసిన వెంటనే నేతలు ఇంటింటా ప్రచారంతో గెలుపు కోసం యత్నించారు. మంగళవారం జరుగనున్న ఉప ఎన్నికల పోలింగ్‌కు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు పోలీసులు పక్కాబందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. దుబ్బాక పోరులో  ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరో ఇరవై మంది బరిలో ఉన్నారు. మంగళవారం దుబ్బాకలో పోలింగ్‌ ‌జరగనుండగా..10న కౌటింగ్‌ ‌చేపట్టి ఫలితం వెల్లడించనున్నారు. దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్‌ ‌జరుగునున్న నేపథ్యంలో స్థానికేతరులను అక్క•
• నుంచి పంపించి వేశారు. ఉప ఎన్నికల బరిలో 23 మంది అభ్యర్థులు ఉన్నారు. టీఆర్‌ఎస్‌ ‌నుంచి సోలిపేట సుజాత, కాంగ్రెస్‌ ‌నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్‌ ‌రావు పోటీపడుతున్నారు. నేడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ ‌జరుగనుంది. ని

లక్షా 98 వేల 756 మంది వోటర్లున్నారు. అధికారులు 315 పోలింగ్‌ ‌కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 89 కేంద్రాలను సమస్యాత్మకంగా పోలీసులు గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్‌ ‌కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందడంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్‌ఎస్‌ ‌నుంచి రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత పోటీలో ఉన్నారు. మొత్తం వోటర్లు 1,98,807 మందిలో 98028 మంది పురుషులు, 100719 మహిళలు వోటు హక్కు వినియోగించు కోబోతున్నారు. ఎన్నిక నిర్వాహణకు 5,000 సిబ్బందిని నియామకం చేశారు.  కోవిడ్‌ ‌నిబంధనలతో ఈ పోలింగ్‌ ‌జరగనుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసారు. ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వోటు హక్కును వినియోగించుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి భారతి హోలికేరి పిలుపునిచ్చారు.  దుబ్బాక ఉప ఎన్నికకు అన్ని పోలింగ్‌ ‌కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. తాగునీరు, మరుగుదొడ్లు, ప్రత్యేక టెంట్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతి పోలింగ్‌ ‌కేంద్రం వద్ద వోటరుకు వోటరుకు మధ్య భౌతికదూరం 5 టర్లు దూరం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా వీల్‌ ‌చైర్లు, గర్భిణులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఆ ప్రాంతంలో పని చేసే అందరికి సెలవుదినంగా ప్రకటించామని తెలిపారు. వోటు హక్కును వినియోగించుకునేటప్పుడు సంతకం చేస్తారు కాబట్టి వారికి గ్లౌజు అందిస్తున్నట్లు వివరించారు.


ఒకవేళ కోవిడ్‌ ‌బాధితులు అయితే వారు పీపీఈ కిట్లను ధరించి వోటు వేయాలని సూచించారు. ఈ ఉప ఎన్నికలో వందశాతం వోటింగ్‌ ‌జరగడానికి అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలియజేశారు. ఉప ఎన్నికకు 2,000 వేల మంది బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికలు జరిగే ప్రతి ప్రదేశంలో 144 సెక్షన్‌ అమలు ఉంటుందని కలెక్టర్‌ ‌తెలిపారు. ఈ భద్రత బలగాలు ప్రతీ పోలింగ్‌ ‌కేంద్రం వద్ద, ప్రతీ సెక్టార్‌ అధికారులతో స్ట్రాంరూంల వద్ద తదితరల ప్రాంతాల్లో బలగాలు ఉంటాయన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్‌  ‌శాతంను తెలియ జేస్తామన్నారు. దుబ్బాక పరిధిలో మొత్తంగా 10 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు సీపీ జోయల్‌ ‌డేవిస్‌ ‌తెలిపారు. 

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply