Take a fresh look at your lifestyle.

కేసీఆర్‌ ‌ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదు

కేసీఆర్‌ అహంకారానికి, నిరంకుశ పోకడలకు దుబ్బాక తీర్పు జవాబు
ఉప ఫలితంపై విజయశాంతి

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై సినీ నటి విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ స్పందించారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ… టిఆఆర్‌స్‌ అహంకారపూరిత ధోరణులకు… కేసీఆర్‌ ‌దొరగారి నిరంకుశ పోకడలకు జవాబు దుబ్బాక తీర్పు అన్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు దుబ్బాక వోటర్లు
ప్రభావితం కాకుండా పాలకులపై గూడు కట్టుకున్న వ్యతిరేకతను తమ వోటుతో స్పష్టం చేశారు.

వోటమిపై సమీక్షించుకుంటామని  టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలు అంటున్నారు. అయితే, ఈ ఉపఎన్నిక సందర్భంగా టిఆర్‌ఎస్‌ ‌నాయకులు వ్యాఖ్యల్ని గుర్తు చేసుకోవాలి. దుబ్బాకలో టిఆరెస్‌కు లక్ష వోట్ల మెజారిటీ ఖాయమని… బిజెపి, కాంగ్రెస్‌లకు కనీసం డిపాజిట్లు వస్తాయా? అని మొదట వ్యాఖ్యానించి…. ఆ తర్వాత దుబ్బాకలో ఒక్క వోటుతో గెలిచినా గెలుపేనన్నారు. లక్ష మెజారిటీ ఆశించి… ఒక్క వోటుతో గెలుపు చాలనుకునే దుస్థితికి రోజుల వ్యవధిలోనే ఎందుకు దిగజారాల్సి వచ్చిందో ముందు దానిపై సమీక్షించుకోండన్నారు.  ప్రజలు మీరేం చెబితే అది నమ్మే స్థితిలో లేరని గుర్తుంచుకోండనీ ఆ ప్రకటనలో విజయశాంతి పేర్కొన్నారు. ఏది ఏమైనా… దొరాధిపత్య దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా మలిదశ ఉద్యమ ప్రారంభానికి దుబ్బాక ప్రజలు ఊపిరులూదారు. చైతన్యపూరితమైన తెలంగాణ సమాజపు రానున్న రోజుల పోరాటాలలో ఈ దొర కుటుంబ పాలన ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదనీ విజయశాంతి హెచ్చరించారు.హరీష్‌ ‌రావు దుబ్బాక లో ఇంచ్చార్జి ఉండటం వల్ల దుబ్బాక లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి డిపాజిట్‌ ‌వచ్చిందని విజయశాంతి అన్నారు. దుబ్బాక లో హరీష రావు ఇంచ్చార్జీ ఉండటం వల్ల ఈ పోటీ నడిచింది అన్నారు. ఒకవేళ దుబ్బాక లో హరీష రావు ఇంచ్ఛార్జి లేకుంటే టిఆర్‌ఎస్‌ ‌కు డిపాజిట్‌ ‌కూడా రాకపోయేదని విజయశాంతి పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply