Take a fresh look at your lifestyle.

నేతలకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిన దుబ్బాక వోటర్లు

 

తెలంగాణ వ్యాప్తంగా హీటెక్కించిన దుబ్బాక ఉప ఎన్నికల్లో వోటర్లు విలక్షణమైన తీర్పును ఇచ్చారు. మంత్రి దత్తత తీసుకున్న గ్రామంలోనే కాదూ, పిసిసి చీఫ్‌ ఇం‌ఛార్జిగా ఉన్న గ్రామం, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి సొంతూరులోనూ బిజెపి ఆధిక్యతను చాటుకోగా…బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్‌రావు సొంతూరు బొప్పాపూర్‌లో మాత్రం రఘునందన్‌రావు తన పట్టును నిలుపుకున్నారు. మంగళవారం వెల్లడైన దుబ్బాక ఉప ఎన్నికల వోట్ల లెక్కింపులో…మంత్రి తన్నీరు హరీష్‌రావు దత్తత తీసుకున్న చీకోడ్‌లోనూ బిజెపి ఆధిక్యం కనబరిచింది.

హరీష్‌ ‌రావు దత్తత గ్రామమైన చీకోడులో బిజెపి పార్టీ అభ్యర్థి 22 వోట్ల ఆధిక్యం సాధించి మంత్రికే షాక్‌ ఇచ్చింది. ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి సొంతూరైన పోతారంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి కంటే బిజెపి అభ్యర్థికి 110వోట్ల ఆధిక్యంగా వోట్లు వచ్చాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో టిపిసిసి  చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన లచ్చపేట గ్రామంలో కాంగ్రెస్‌ ‌పార్టీకి గట్టి షాక్‌ ‌తగిలింది. ఆయన బాధ్యత తీసుకున్న లచ్చపేట గ్రామంలో కాంగ్రెస్‌ ‌పార్టీకి కేవలం 163 వోట్లు మాత్రమే పోల్‌ అయ్యాయి. ఇక అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఆ గ్రామంలో 520 వోట్లు పోలవగా, బిజెపికి 490 వోట్లు పోల్‌ అయ్యాయి. టిపిసిసి చీఫ్‌గా ఈ పరిణామం ఆయనకు కాస్త ఇబ్బందికరమే అని చెప్పాలి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply