Take a fresh look at your lifestyle.

‌గ్రేటర్‌ ఎన్నికలపై దుబ్బాక ప్రభావం

  • జిహెచ్‌ఎం‌సిలోనూ బిజెపి పాగా
  • మీట్ ది ప్రెస్‌లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ ‌రావు

నూటికి నూరు శాతం జీహెచ్‌ఎం‌సీ ఎన్నికలపై దుబ్బాక ప్రభావం ఉంటుందని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. దుబ్బాక ఫలితమే జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వి•ట్‌ ‌ద ప్రెస్‌లో రఘునందన్‌ ‌మాట్లాడారు. ఉప ఎన్నిక సమయంలో తమపై పెట్టిన కేసులను న్యాయస్థానంలో గెలుస్తామని చెప్పారు.

నమ్మిన సిద్దాంతం కోసం పోరాడితే ఆలస్యంగానైనా విజయం దక్కుతుందని తన విషయంలో నిరూపితమైందన్నారు. తన కోసం పోరాడిన కార్యకర్తలకు శిరస్సు వొంచి నమస్కరిస్తున్నట్లు రఘునందన్‌ ‌చెప్పారు. తెరాసలో సుమారు 30 నుంచి 40మంది నాయకులు అసంతృప్తులుగా ఉన్నారని.. వారందరూ భాజపాలోకి రావాలని ఆహ్వానించారు. గ్రేటర్‌లో వరద సాయం పూర్తిగా ఎన్నికల కోసం పంపిణీ చేసిన డబ్బుగానే పరిగణిస్తున్నామన్నారు. హైదరాబాద్‌పై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. పదవులు ఉన్నా లేకున్నా ఒకేలా పనిచేస్తానని..జీవితాంతం భాజపాలోనే కొనసాగనున్నట్లు రఘునందన్‌రావు స్పష్టం చేశారు.

Leave a Reply