Take a fresh look at your lifestyle.

సానుభూతి వైపు మొగ్గు చూపని దుబ్బాక వోటరు

కొద్ది వారాలుగా ఎంతో వేడి పుట్టించిన దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎట్టకేలకు బీజేపీ విజయం సాధించింది. బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా టీఆర్‌ఎస్‌ ‌గెలుస్తుందని అంతా ఆశించారు. కానీ, ఫలితం తారుమారైంది. బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురైన నేపథ్యంలో ఎలాగైనా దుబ్బాక స్థానాన్ని తిరిగి కైవసం చేసుకొని తమ బలం మరోసారి నిరూపించుకోవాలనుకున్న టీఆర్‌ఎస్‌ ఆశ నిరాశే అయింది. తొలి నుంచి ప్రతి రౌండ్కు ఫలితం నువ్వా నేనా అన్నట్లు కొనసాగింది. చివరి వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఫలితంపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.ఉత్కంఠగా సాగిన పోరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై 1,470 ఓట్ల మెజారిటీతో రఘునందన్‌ ‌రావు గెలుపొందారు. బీజేపీకి 62,772.. టీఆర్‌ఎస్కు 61,302, కాంగ్రెస్కు 21,819 ఓట్లు దక్కాయి. రెండో స్థానంలో టీఆర్‌ఎస్‌ ‌నిలవగా.. మూడో స్థానం కాంగ్రెస్‌ ‌దక్కించుకుంది. ఆఖరు రౌండ్లలో బీజేపీ వరుసగా ఆధిక్యం కనబరుస్తూ ఉండడంతో అప్పటికే హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో సంబరాలు మొదలైపోయాయి.

దుబ్బాకలో విజయం నల్లేరుపై నడక అనుకున్న అధికార పార్టీ కి కర్ర కాల్చి వాత పెట్టారు నియోజక వర్గ ప్రజలు. ఉప ఎన్నిక అంటేనే టి ఆర్‌ ఎస్‌ ‌కు కంచు కోట. దుబ్బాక ఉప ఎన్నికతో రికార్డులకు బ్రేక్‌ ‌పడినట్లయింది. ఈ ఉప ఎన్నికలో తెరాస పార్టీ చూపించిన అతివిశ్వాసమే కొంపముంచగా, బీజేపీ నేతల ఇండ్లలో అప్రజాస్వామిక సోదాలు, గొడవలు, తెరాస నాయకుల అహంభావం తో పాటు, ప్రైవేట్‌ అధ్యాపకుల నిరాశ , హైదరాబాద్‌ ‌వరదలు ఇలా తలా కొంచెం కారణమయ్యాయి. రైతుల సంక్షేమం కోసం కే సి ఆర్‌  ‌తెచ్చిన ధరణి పెద్దగా ఈ ఉప ఎన్నికకు దోహదపడలేదనే చెప్పాలి. తెరాస పార్టీ అభ్యర్థి భర్త మరణంతో ఉప ఎన్నిక నిర్వహించగా, అందరు సదరు అధికార పార్టీ అభ్యర్థికి సానుభూతి ఓట్లు పడుతాయి కావున గట్టెక్కుతుందని అనుకున్నారు. కానీ ఓటరు నాడి పసికట్టడం ఎవరితరం కాదని దుబ్బాక ఎన్నిక ద్వారా రుజువైంది. అయితే ఈ ఎన్నిక గెలుపోటములు ప్రక్కన పెడితే గ్రేటర్‌ ఎన్నికల ముందు దుబ్బాక ఓటమి తెరాస ప్రభుత్వం, నాయకులను పునరాలోచనలో పడేయగా, బీజేపీ శ్రేణులకు కొత్త ఉత్సాహం తెచ్చిపెట్టిందనేది వాస్తవం.
ఈ ఫలితం పై టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కె.తారక రామారావు స్పందిస్తూ, విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోము.. గతంలో ఇదే చెప్పాం, ఇప్పుడు ఇదే చెప్తున్నామని , తెలంగాణ ఏర్పడిన నాటినుంచి ఏ ఎన్నిక అయినా గెలుపు మావైపే నిలించిందన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ‌కు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన ఆర్థిక శాఖ మంత్రి టీ.హరీష్‌ ‌రావు తో పాటు మిగతా నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి ఆశించిన ఫలితం రాలేదని. ఈ ఎన్నిక మమ్మల్ని అప్రమత్తం చేసిందని, మా నాయకులకు ఒక హెచ్చరికలా ఈ ఓటమి ని భావిస్తామని కేటీఆర్‌ ‌తెలిపారు.

image.png
డా।। ఎండి ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్, 9492791387

Leave a Reply