Take a fresh look at your lifestyle.

దుబ్బాక ఉప ఎన్నికకు.. ప్రత్యేక పరిశీలకుడుగా సీనియర్‌ ‌పోలీస్‌ అధికారి సరోజ్‌ ‌కుమార్ ను‌ ‌నియిమించిన కేంద్ర ఎన్నికల సంఘం

దుబ్బాక ఉప ఎన్నికను పర్యవేక్షించేందుకు తమిళనాడుకు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సరోజ్‌ ‌కుమార్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. మొత్తం వ్యవహారాన్ని స్పెషల్‌ ఆఫీసర్‌ ‌సమీక్ష చేయనున్నారు. బిజెపి, టిఆర్‌ఎస్‌ ‌మధ్య నోట్ల కట్టల వ్యవహారం తీవ్ర రాజకీయం దుమారం రేపింది. ఇరుపార్టీలు ఆరోపణలు..ప్రత్యారోపణలతో ఎన్నికల ప్రచారం వేడెక్కించారు.

మరోవైపు బీజేపీ, టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ‌పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుడిని సీఈసీ నియమించింది. నోట్ల కట్టల కలకలంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి విషయాన్ని ఆయన పరిశీలించి ఇసికి ఎప్పటికప్పుడు నివేదిక అందచేస్తారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply