Take a fresh look at your lifestyle.

నవంబర్‌ 3‌న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌..10‌న కౌంటింగ్‌

 ‌‌షెడ్యూల్‌ ‌విడుదల..అక్టోబర్‌ 9‌న నోటిఫికేషన్‌ 

సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్‌ ‌విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. దుబ్బాకతో పాటు దేశంలోని పలు అసెంబ్లీల్లో ఖాళీలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్‌ 3‌న దుబ్బాక నియోజకవర్గానికి పోలింగ్‌ ‌నిర్వహించనున్నారు. 10న కౌంటింగ్‌ ‌జరగనుంది.

అక్టోబర్‌ 9‌న నోటిఫికేషన్‌ ‌విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు చివరితేదీ అక్టోబర్‌ 16. ‌నామినేషన్లను 17న పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్‌ 19‌గా ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచార పర్వాన్ని మొదలు పెట్టాయి. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో వెంటనే దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది.

Leave a Reply