Take a fresh look at your lifestyle.

కొరోనా జాగ్రత్తలపై పట్టణాల్లో నిర్లక్ష్యం

  • గ్రామాల్లోనే ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు
  • రిమ్మనగూడలో శనిగల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి హరీష్ రావు 

‌గ్రామాల్లో కరోనాపై తీసుకుంటున్న జాగ్రత్తలు పట్టణాల్లో కనబడడం లేదని.. అందుకే పట్టణాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. దేశవ్యాప్తంగా మిగతా రాష్టాల్ర కంటే తెలంగాణా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కరోనా కొంత తక్కువగానే ఉందన్నారు. కరోనా రావడానికి కులము, మతము అనే తేడా లేదన్నారు. దీని నివారణకు సోషల్‌ ‌డిస్టెన్స్‌తో పాటు జాగ్రత్తలు వహించడం తప్ప మరోమార్గం లేదన్నారు. గజ్వేల్‌ ‌మండలం రిమ్మనగూడలో శనిగల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి హరీష్‌ ‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ‌ప్రతాప్‌ ‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి హరీష్‌ ‌మాట్లాడుతూ.. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుందని, రైతులు బాగా ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోళ్ల కేంద్రాలకు తేవాలన్నారు. తేమ శాతం ఉంటే కొనుగోళ్లు చేయరని, దీంతో స్థలాభావ సమస్య, ఇతర రైతులకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. రెండు రోజుల వరకూ రైతులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడి ఇబ్బందులు వస్తాయన్నారు. తోటి రైతులకు ఇబ్బందులు రాకుండా, ఏ రోజు ధాన్యం ఆ రోజే కొనుగోళ్లు జరగాలంటే.. ధాన్యాన్ని ఆర బెట్టుకుని కొనుగోళ్ల కేంద్రాలకు తేవాలని రైతులకు విజ్ఞప్తి చేసారు. డివిజన్‌ ఆర్డీఓ, మండల తహశీల్దార్లు ప్రతి రోజూ కొనుగోళ్ల కేంద్రాల్లో పర్యటించి గన్నీ సంచుల కొరత, కొనుగోళ్ల కేంద్రంలో లారీలు రాకపోవడం ఇతరత్రా సమస్యలపై దృష్టి సారించాలని సమన్వయ లోపం ఉంటే సమన్వయ పర్చాల్సిన బాధ్యత ఆయా మండలాల తహశీల్దార్లదేనని సూచించారు.

కరోనా వ్యాధి నివారణ చేయాలంటే.. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తికి వ్యక్తికి మధ్య సామాజిక దూరం పాటించడమే అసలైన మార్గమని, దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం. ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల వద్ద రైతులు ఓకేచోట గుమిగూడకుండా సామాజిక దూరాన్ని పాటించాలి. ప్రతి కొనుగోళ్ల కేంద్రంలో నీళ్లు, సబ్బు, శానిటైజర్లను రైతులకు అందుబాటులో ఉంచాలి. రైతు పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఎంతో శ్రద్ధతో పని చేస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా రైతు శ్రేయస్సు కోసమే తెలంగాణ ప్రభుత్వం ఈ రకమైన ఏర్పాట్లు చేపట్టింది. రైతు సంక్షేమం కోసం ప్రతి నిమిషం ఆలోచించే ముఖ్యమంత్రి మన కేసీఆర్‌. ‌క్వింటాలు రూ. 4875/- రూపాయల మద్దతు ధరతో శనగల కొనుగోళ్లు చేస్తున్నాం. దళారులు లేకుండా రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోళ్లు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 7770 వరి కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. త్వరలోనే మొక్కజొన్న, వరి, పొద్దు తిరుగుడు కొనుగోళ్ల కేంద్రాలను ప్రతి మండలాల్లో ప్రారంభిస్తాం. ఇందు కోసం రూ. 30 వేల కోట్ల రూపాయల డబ్బు కొనుగోళ్ల కోసం ప్రభుత్వం కేటాయింపులు చేసింది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పేదవాళ్ల కోసం ఉపాధి హా పనులను గ్రామ పంచాయితీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రారంభించండి. రైతులు కూరగాయలు విక్రయించేందుకు మార్కెట్‌ ‌కు వెళ్లేందుకు పోలీసులు ప్రత్యేక పాసులు జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ ‌చిట్టి దేవేందర్‌ ‌రెడ్డి, ఏంపీపీ, జెడ్పిటీసీ, పీఏసీఏస్‌ ‌చైర్మన్‌, ‌రైతు బంధు నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy