Take a fresh look at your lifestyle.

‘‌ఫుల్‌’‌జోష్‌లో మందుబాబులు

  • తెరుచుకున్న మద్యం దుకాణాలు
  • ఉదయం నుంచే క్యూ కట్టిన మద్యం ప్రియులు
  • నిబంధనలు ఉల్లంఘన,పాటించని సామాజిక దూరం
  • మందుబాబులతో కలసి క్యూలో మహిళలు

ఖమ్మం, మే 6 ప్రజాతంత్ర (ప్రతినిధి) : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. లాక్‌డౌన్‌ ‌నేపధ్యంలో సుమారు 42 రోజుల తర్వాత జిల్లాలో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యం ప్రియుల్లో ఆనందం వెల్లివిరిసింది. దీంతో మందుబాబులు వేకువజామునే మద్యం దుకాణాల వద్ద క్యూకట్టారు. పురుషులతో పాటు మహిళలు ఉత్సాహంగా క్యూ లో నిల్చుని మద్యం కొనుగోలు చేశారు. మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యం ప్రియుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. రెడ్‌జోన్లు సహా జిల్ల్టా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఉదయం 10 గంటల నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభించారు. పలు ప్రాంతాలలో మద్యం కోసం తెల్లవారుజామున నుంచి కొన్ని పాంత్రాలలో ఉదయం 8గంటల నుంచి మందుబాబులు షాపుల ముందు బారులు తీరారు. ఖమ్మం నగరంలో పలు ప్రాంతాలలో క్యూలో చెప్పులు, వివిధ రకాల వస్తువులు ఇటుకలు, రాళ్ళను తమ వంతుగా పెట్టుకున్న సంఘటనలు కనిపించాయి.

వీటిని చూసిన బాటసారులు ఆసక్తిగా తిలకించారు. చీప్‌ ‌లిక్కర్‌పై 11 శాతం, మిగిలిన అన్ని బ్రాండ్లపై 16 శాతం ధరలు పెంచి విక్రయాలు చేపట్టారు. అయినా మద్యం ప్రియులు మాత్రం మద్యం కోసం పోటిపడి మరి కొఓనుగోలు చేశారు. కొన్ని దుకాణాల వద్ద పోలీసులు బందో బస్తూ నిర్వహించగా ఖమ్మంలో దుకాణాల వద్ద మహిళా పోలీసులు బందో బస్తూ నిర్వహించడం గమనార్హం. మద్యం దుకాణాల వద్ద కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని, నిబంధనలు ఉల్లఘిస్తే లైసెన్సు రద్దుచేస్తామని ప్రకటించి నప్పటికి ఆదేశాలను పట్టించుకోలేదు. మందుబాబులు నింబధనలు పాటించకపోవడంపై ప్రజల నుంచి విమర్శిలు వ్యక్తం అవుతున్నాయి. మద్యం దుకాణాలు తెరుచుకునే వరకు పెద్ద సంఖ్యంలో బారులు తీరారు. పలు చోట్ల షాపు యాజమాన్యాలు బారీ కేళ్ళను ఏర్పాటు చేశారు. 42 రోజుల తరువాత తెరుచుకోవడంతో పెద్ద సంఖ్యలో బాటిల్స్ ‌తీసుకునేందుకు ప్రయత్నించారు. షాపులు మళ్ళీ బంద్‌ ‌చేస్తారనే ఊహగానాలతో పెద్ద ఎత్తున మద్యం ప్రియులు మద్యం కోసం బారులు తీరారనే ప్రచారం సాగింది. తొలిరోజు మద్యం దుకాణాల వద్ద జాతరను తలపించింది.

గరిడేపల్లిలో…
గరిడేపల్లి, మే 6(ప్రజాతంత్ర విలేకరి) : ప్రభుత్వం లాక్‌డౌన్‌ ‌సడలింపుల్లో భాగంగా మద్యం దుకాణాలకు అనుమతినివ్వడంతో దుకాణాల ముందు ప్రజలు బారులు తీరారు. మండల కేంద్రంలోని వైన్స్ ‌ముందు భారీగా మందుబాబులు క్యూ కట్టారు. కాగా వైన్స్ ‌దుకాణాలు నిర్వాహకులు బారికేడ్స్ ఏర్పాటు చేశారు. అదే విధంగా మందుబాబుల• క్యూలైన్లో భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామునుంచే దుకాణాల ముందు క్యూ కట్టారు. ఎట్టకేలకు మద్యం దుకాణాలు తెరవడంతో మద్యంప్రియుల్లో ఆనందం నెలకొంది.

Leave a Reply