Take a fresh look at your lifestyle.

7‌గంటల వరకే మందుల దుకాణాలు

‌ప్రజాతంత్ర ప్రతినిధి):రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ ‌విజృంభిస్తున్న నేపధ్యంలో నేటి నుండి ఉదయం 8గంటల  నుండి సాయంత్రం 7గంటల వరకు మాత్రమే మందుల దుకాణాలు తెరిచి ఉండడం జరుగుతుందని జిల్లా , పట్టణ కెమిస్ట్ అం‌డ్‌ ‌డ్రగ్గిస్ట్, ‌ఫార్మస్యూటికల్‌ ‌డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్‌ అధ్యక్షులు యామా ప్రభాకర్‌, ‌పెండెం విజయ్‌, ‌ముశంహరిలు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘ కార్యాలయంలో డోర్‌ ‌పోస్టర్‌ని ఆవిష్కరించి మాట్లాడారు.

రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్‌ ‌మూలంగా ముందస్తు జాగ్రత్తగా సమయపాలనను కొనసాగించడం జరుగుతుందన్నారు. అలాగే జిల్లా ప్రజలకు రాష్ట్రవిద్యుత్‌ ‌శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, అధికారులు సూచించిన విధంగా అందుబాటులో ఉంచి మందుల కొరత రాకుండా చూస్తామన్నారు. కరోనాను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న యుద్దంలో తాము ఈ విధంగా పాలుపంచుకుంటున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు గుండా శ్రీనివాస్‌, ‌మారుతి సైదులు, కడవేరు వెంకట్‌, ‌చందన లింగయ్య, కర్నాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply